హీరోయిన్ సమంత హోస్ట్ గా నిర్వహిస్తున్న టాక్ షో సామ్ జామ్ కి అతిథిగా హాజరయ్యారు మెగాస్టార్ చిరంజీవి. ఈ టాక్ షోలో సమంత అడిగిన ప్రశ్నలకు చిరు తనదైన శైలిలో సమాధానాలు చెప్పారు. అలాగే ఓ సినిమా థియేటర్ లో జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్ గురించి కూడా ఆయన ఈ టాక్ షోలో ఓపెన్ కావడం జరిగింది. కోతలరాయుడు మూవీలో చిరుతో పనిచేసిన హీరోయిన్ మంజు భార్గవి, ఆయనను శంకరాభరణం మూవీ ప్రీమియర్ షోకి ఆహ్వానించారట. అప్పటికి చిరంజీవికి పెళ్లి కాలేదట. ఆ ప్రీమియర్ షోకి అల్లు రామలింగం కుటుంబం కూడా హాజరయ్యారట. 

శంకరాభరణం మూవీ క్లైమాక్స్ చూసిన చిరు భావోద్వేగానికి గురయ్యారట. ఆయనకు కన్నీళ్లు వచ్చేయడంతో ఎవరైనా చూస్తే.. నవ్వుతారని కర్చీఫ్ కోసం వెతుకుతున్నాడట. పక్క సీటులో ఉన్న మంజు భార్గవి కళ్ళు తుడుచుకోమని ఆమె చీర కొంగును చిరుకు ఇచ్చారట. ఆమె చీర కొంగుతో చిరంజీవి కళ్ళు తుడుచుకుంటూ ఉండగా... సడన్ గా లైట్స్ వెలిగాయట. మంజు భార్గవి చీర కొంగు తన చేతిలో ఉండడం చూసిన వారందరు తప్పుగా అనుకున్నారేమో అని చిరంజీవి బాధపడ్డారట. 


ఆ షోకి తండ్రి అల్లు రామలింగయ్యతో పాటు హాజరైన సురేఖ తర్వాత తనను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడదేమో అని చిరంజీవి అనుకున్నారట. కానీ సురేఖ చిరంజీవితో పెళ్ళికి అంగీకరించింది అని చిరంజీవి ఆ రోజు జరిగిన ఫన్నీ సిట్యుయేషన్ ని సమంతతో పాటు తెలుగు ప్రేక్షకులకు తెలియజేశారు. కళా తపస్వి కె విశ్వనాథ్  తెరకెక్కించిన శంకరాభరణం అప్పట్లో అనేక అంతర్జాతీయ అవార్డులు గెలుపొందింది. ఆ తరువాత చిరంజీవితో విశ్వనాధ్ స్వయం కృషి, ఆపద్భాందవుడు చిత్రాలు తెరకెక్కించారు.