Asianet News TeluguAsianet News Telugu

#Devara గ్లిప్స్ ఆనందంలో “ఆచార్య”టాపిక్.!ఇప్పుడే రిలీజ్ చేయాలా

 ఎన్టీఆర్ కెరియర్లో 'ఆర్ ఆర్ ఆర్' తరువాత అత్యధిక బడ్జెట్ తో నిర్మితమవుతున్న సినిమా ఇది. అందువలన ఎన్టీఆర్ అభిమానులంతా కూడా ఈ సినిమా కోసం వేయికళ్లతో వెయిట్ చేస్తున్నారు. 

Chiranjeevi Ram Charan Acharya Movie hindi release jsp
Author
First Published Jan 9, 2024, 2:49 PM IST


ఎన్టీఆర్ హీరోగా, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ దేవర. ఏప్రిల్ 5, 2024 న రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమా పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం కి సంబందించిన గ్లింప్స్ వీడియో ను మేకర్స్ రిలీజ్ చేయగా, సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా కు ముందు ఆచార్య చిత్రం చేసారు కొరటాల శివ. అది డిజాస్టర్ అయ్యింది.  దాన్నుంచి ఇప్పుడే మర్చిపోతున్నారు. అయితే ఊహించని విధంగా ఆచార్య మరో సారి ట్రెండింగ్ లో కు వస్తుంది. అందుకు కారణం ఈ సినిమా హిందీ వెర్షన్ రిలీజ్ కు రెడీ అవ్వటమే.   వివరాల్లోకి వెళితే..

  మెగాస్టార్ చిరంజీవి, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టించిన తాజా చిత్రం ‘ఆచార్య’. స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ తెర‌కెక్కించిన ఈ చిత్రం ఏప్రిల్ 29న రిలీజ్ అయ్యింది. క్రేజీ కాంబినేష‌న్‌లో రూపొందిన ఈ చిత్రంపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. అయితే ‘ఆచార్య’ రిలీజ్ త‌ర్వాత ఇటు ఫ్యాన్స్‌ని, అటు ప్రేక్ష‌కుల‌కు సినిమా మెప్పించ‌లేక‌పోయింది. ఎన్నో అంచ‌నాలు పెట్టుకున్న సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద తొలి ఆట నుంచే ఆశించిన టాక్‌ను రాబ‌ట్టుకోలేక‌పోయింది. తొలి రోజున వ‌చ్చిన క‌లెక్ష‌న్స్‌కు, మూడో రోజు క‌లెక్ష‌న్స్‌కు సంబంధ‌మే క‌నిపించ‌  లేదు. అప్పటికే పూర్తి డ్రాప్ అయ్యింది. ఇక  ఈ చిత్రాన్ని అప్పుడే తెలుగు సహా పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ చేస్తారు అని టాక్ వచ్చింది కానీ తర్వాత కేవలం హిందీ రిలీజ్ మాత్రమే చేస్తామని కన్ఫర్మ్ చేశారు.

ఇప్పుడు ఈ సినిమా హిందీ వెర్షన్ రిలీజ్ అవుతోంది. అయితే థియేట్రికల్ వెర్షన్ మాత్రం రిలీజ్ చేయటం లేదు.  అక్కడ ప్రముఖ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ వారు అయితే ఇప్పుడు ఆచార్య హిందీ రిలీజ్ డేట్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందించారు. తాజాగా సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేసి హిందీ వెర్షన్ లో ఈ జనవరి 11న తమ యూట్యూబ్ ఛానెల్లో రిలీజ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. దీనితో మొత్తానికి ఈ సినిమా ఈ రకంగా విడుదల కాబోతోంది.  ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించగా పూజా హెగ్డే చరణ్ సరసన హీరోయిన్ గా నటించింది. టైమ్ చూసి మరీ ఈ సినిమా రిలీజ్ చేస్తున్నట్లు ఉందని చాలా మంది కామెంట్ చేస్తున్నారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios