యువ తమిళ నటి ఐశ్వర్య రాజేష్ ప్రస్తుతం అద్భుతమైన అవకాశాలు అందుకుంటోంది. కేవలం హీరోయిన్ పాత్రల కోసమే ఎదురుచూడకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటోంది. ఐశ్వర్యరాజేష్ కు ప్రస్తుతం తెలుగులో కూడా అవకాశాలు వస్తున్నాయి. ఐశ్వర్య రాజేష్ ఇటీవల మణిరత్నం నవాబ్, వాడా చెన్నై లాంటి విజయవంతమైన చిత్రాల్లో నటించింది. 

ఐశ్వర్య రాజేష్ నటించిన కణ చిత్రం తమిళంలో ఘనవిజయం సాధించింది. క్రికెట్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో సత్యరాజ్ కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రాన్ని తెలుగులో కౌసల్య కృష్ణమూర్తి పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఇందులో కూడా ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలో నటిస్తోంది. సత్యరాజ్ పాత్రలో రాజేంద్ర ప్రసాద్ నటిస్తున్నారు. 

ఈ చిత్ర టీజర్ ని మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా మంగళవారం జూన్ 18 సాయంత్రం 5 గంటలకు రిలీజ్ చేయనున్నారు. కొద్ది సేపటి క్రితమే ఐశ్వర్య రాజేష్ ఆసక్తికర విషయాన్ని తెలియజేస్తూ ట్వీట్ చేసింది. కౌసల్య కృష్ణమూర్తి టీజర్ ని మెగాస్టార్ చిరంజీవి ఆల్రెడీ చూసేశారు. టీజర్ చూసిన తర్వాత చిరు ఐశ్వర్య రాజేష్ కు ఫోన్ చేశారట. చిరంజీవి గారి నుంచి నాకు ఫోన్ రావడం ఆశ్చర్యాన్ని కలిగించింది. 

ఆయన నాతో ఎంతో చక్కగా మాట్లాడారు. టీజర్ బావుందని అన్నారు. మీనుంచి నాకు ఫోన్ రావడంతో సంతోషంలో గంతులేస్తున్నా. థాంక్యూ సర్ అని ఐశ్వర్య రాజేష్ ట్వీట్ చేసింది.