మా స్టార్ లోగో లాంచ్ కార్యక్రమంలో అంతరంగం విప్పిన మెగాస్టార్ నాగార్జునను చూసే వ్యాపారంలో అడుగుపెట్టానంటున్న చిరంజీవి ఫ్యాన్స్ సెంటిమెంట్ వల్లే తనకు తిరిగి పదేళ్లకు వచ్చినా ఆదరణ 

స్టార్ నెట్ వర్క్ చేతిలోకి వెళ్లిపోయిన మాటీవీ ఇప్పుడు స్టార్ మాగా మారింది. ఈ ఛానెల్ కొత్త లోగో మెగాస్టార్ చిరంజీవి ఈ లోగో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ... 150వ సినిమా పెద్ద ఘన విజయం సాధించింది. ఇక ఏమిటీ అనుకుంటున్న తరుణంలో మీలో ఎవరు కోటీశ్వరుడు ద్వారా మళ్లీ నాకు ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఏర్పడింది. ఈ మీలో ఎవరు కోటీశ్వరుడు చేస్తున్న సమయంలో నాకు కొత్త ఎక్స్ పీరియన్స్ ఎదురైంది. గతంలో ఉప్పుడూ నేను టీవీ యాంకర్ గానో, టీవీ హెస్ట్ గానో ఇలాంటి గేమ్ షోలు నిర్వహించింది లేదు. అలాంటిది ఈ షోలో ఈ జర్నీ చేస్తున్నపుడు రకరకాలైన ప్రజలను కలుసుకునే అవకాశం కలుగుతోంది అని చిరంజీవి అన్నారు.

2017 నిజంగానే నేను మరిచిపోలేని సంవత్సరమని మెగాస్టార్ అభిప్రాయపడ్డారు. ఈ పది సంవత్సరాల్లో సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉండి తిరిగి మళ్లీ సినిమా చేస్తే ఆడియన్స్ రియాక్షన్ ఎలా ఉంటుంది. వారు నన్ను మళ్లీ ఎలా రిసీవ్ చేసుకుంటారు. గతంలో ఉన్నటువంటి ప్రేమ అభిమానం అదే రకంగా ఉంటుందా? అనే డౌటు ఉండేది. కానీ అనుమానాలన్నీ పటాపంచలు చేస్తూ ఖైదీ ని ప్రేక్షకులు ఆదరించిన తీరు, నాపై చూపిన ప్రేమ అభిమానం ఎప్పటికీ మిరిచిపోలేను.

ఎక్కడో ఏదో సినిమాలో అన్నాను... తెలుగు ప్రేక్షకలు, ప్రజలు సెంటిమెంటల్ ఫూల్స్ ఒక్కసారి ప్రేమించడం మొదలు పెడితే జీవితంలో వారు ఆ ప్రేమను దూరం చేసుకోరు. జీవితాంతం ప్రేమిస్తూనే ఉంటారు. దానికి నిదర్శనమే ఖైదీ నెం 150 భారీ విజయం. నన్ను మళ్లీ అక్కున చేర్చుకున్న తెలుగు ప్రజలకు, ప్రేక్షకులకు నా హృదయ పూర్వక కృతజ్ఞతలతో నా జీవితం ఇలానే కొనసాగుతుంది అని చిరంజీవి చెప్పుకొచ్చారు.

నేను నటుడిగానే ఇన్ని సంవత్సరాలు సినిమా రంగంలో ఉన్నాను. నటనే నా మెయిన్ ప్రొఫెషన్. తర్వాత అనుకోని కారణాలతో నా అభిరుచి కొద్దీ పాలిటిక్స్ కివెళ్లడం జరిగింది. ఎప్పుడూ కానీ వ్యాపారాలు చేయాలనే ప్రయత్నాలు చేయలేదు. నేను మొదట బిజినెస్ అంటూ చేసింది మా ఛానల్ లో. మిత్రుడు నాగార్జున ప్రోత్సాహం మేరకు నేను కూడా మా ఛానల్ లో పెట్టుబడి పెట్టి భాగస్వామిని అయ్యాను. నేను, నాగార్జున, నిమ్మగడ్డ ప్రసాద్, అల్లు అరవింద్ అసోసియేట్ అయ్యి మా ఛానల్ నడిపించామని తెలిపారు.

మా టీవీ అంతర్జాతీయ స్థాయి ఉన్నటు వంటి స్టార్ టీవీతో విలీనం అవుతున్న సమయంలో మేము దాని నుండి బయటకు రావాల్సి వచ్చింది. ఆ సమయంలో మాటీవీకి దూరం అయ్యామనే బాధ కాస్త ఉండేది. కానీ ఆ బాధ ఎంతో సేపు లేదు. తిరిగి మా టీవీకి మీలో ఎవరు కోటీశ్వరుడు ద్వారా అసోసియేట్ అవ్వడం చాలా ఆనందంగా ఉందన్నారు.

మీలో ఎవరు కోటీశ్వరుడు నాలుగో సీజన్ చేయాలని నాకు ఆఫర్ వచ్చినపసుడు .... నాగార్జున గారిని మార్చాల్సిన అవసరం ఏముంది? ఇది అవసరమా అనుకున్నాను? కానీ వాళ్లందరూ కలిసి కొత్తగా వస్తున్నపుడు ఒక చేంజ్ కావాలిన అని నన్ను సంప్రదించారు. నాగార్జున గారిని తక్కువ చేయడం కాదు.. అని కన్విన్స్ చేయడం జరిగింది. వెంటనే నాగార్జునకు ఫోన్ చేసాను. ఆయన కూడా మార్పు కావాలి. మీరు చేయాలి అన్నారు. మీరు తప్పకుండా ఈ ఫ్రోగ్రామ్ ను మరో లెవల్ కి తీసుకెళతారు అని ప్రోత్సహించారు. ఇది అంత ఈజీగా అనుకోలేదు. సినిమాల్లో లాగా పేపర్ మీద డైలాగులు చదివి యాక్ట్ చేయడం కాదు. కార్యక్రమంలో పాల్గొనే వారి భావోద్వేగాలకు అనుగుణంగా మనం స్పందించడం, షోను ఆసక్తికరంగా ముందుకు నడిపించడం లాంటివి చేయాలి. సినిమాల కంటే ఈ ఫ్రోగ్రామ్ చేయడమే చాలా కష్టం అనిపించింది అని చిరంజీవి అన్నారు.

జీవితంలో రకరకాల ఎదురు దెబ్బలు, సన్మానాలు, రకరకాల ప్రశంసలు, పొగడ్తలు, లైఫ్ లో చూడనివి ఏమీ లేవని మెగాస్టార్ అన్నారు. నెగెటివ్, పాజిటివ్.... హిట్లు, ప్లాపులు అన్నీ చూసాను. వాటిని నువ్వు వోన్ చేసుకుంటే నిన్ను ఇబ్బంది పెడతాయి. నువ్వు డిస్ వోన్ చేసుకుంటే అవి జస్ట్ పాసింగ్ క్లౌడ్ లా వెళ్లి పోతాయి తప్ప నీపై ఎలాంటి ఎఫెక్ట్ చూపించవు. ఇవన్నీ కూడా బాహ్య ప్రపంచానికి సంబంధించినవే తప్ప అంతర్గతంగా ఉన్న మన మనశ్శాంతిని చెక్కు చెదరకుండా ఉంచుకుంటే నువ్వు ప్రశాంతంగా ఉంటావు తద్వారా నీ కుటుంబ సభ్యులు ప్రశాంతంగా ఉంటారు ప్రతి చిన్న దానికి మనం తల్లడిల్లి పోతుంటే, మనం ఎమోషన్ గురవుతే.. జీవితంలో చేయాల్సినవి ఏవీ చేయలేం. ఎవరో ఏదో మాట అంటారు. కాస్త బాధ అనిపిస్తుంది. దాన్ని పట్టించుకోకుండా ముందుకు సాగాలి. మనం జరిగిపోయింది మార్చలేం. రేపు జరుగబోయే ఏమిటో మనకు తెలియదు. ప్రజంట్ మనం ఏం చేయాలి అనే దానిమీదే ఫోకస్ పెట్టి నీ శక్తి మేర కష్టపడితే నువ్వు ది బెస్ట్ ఇవ్వగలవు. నిన్ను విమర్శించిన వారికి నీ విజయమే సమాధానం అవుతుంది. అలాంటి మెకానిజం నా మైండ్ లో ఉంది కాబట్టే నా పని నేను చేసుకుంటూ సక్సెస్ ఫుల్ గా ముందుకెల్తున్నానని చిరంజీవి అన్నారు.