నటుడుగా కొనసాగించటం అనేది ఓ ఛాలెంజింగ్ జాబ్. ఎప్పటికప్పుడు తన శరీరంలో వచ్చే మార్పులును పసిగట్టుకుంటూ వాటని రెగ్యులైజ్ చేసుకోవాలి. బరువు పెరగకూడదు. శరీరంపై వయస్సు ప్రభావం కనపడనివ్వకూడదు. ఇవన్నీ సాధించి, ఎక్కువ కాలం నటుడుగా కొనసాగాలంటే రోజువారి సాధనం అవసరం. అవసరం అయినప్పుడు కఠోరమైన శ్రమ కూడా అవసరమే.

అయితే విజయం ముందు అవన్నీ బలాదూర్ అని చిరంజీవి వంటి నటులు భావిస్తారు. కాబట్టి వారు ఎప్పుడూ శిఖరం పై ఉంటారు. వయస్సులో ఉన్నప్పుడు బాడీ ట్రాన్ఫర్మేషన్ చాలా ఈజీ. అయితే అదే వయస్సు పెరుగుతున్న కొద్ది చాలా కష్టమవుతుంది. చిరంజీవికు వయస్సు ప్రభావం ఉన్నా దాన్ని ఆయన గెలవగలుగుతున్నారు. తను అనుకున్నప్పుడల్లా శరీరాన్ని తన కంట్రోలోకి తెచ్చుకుని సన్నబడి తిరిగి షేప్ కు వస్తున్నారు. 

రాజకీయాలనుంచి సినిమా ప్రపంచంలోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు ఆయన అలా మారి చూపించారు. ఇప్పుడు మరో సారి తన బరువు తగ్గే పనిలో చిరంజీవి పడ్డారని సమాచారం.  కొరటాల శివ దర్శకత్వంలో రూపొందబోయే చిత్రం కోసం ఆయన బరువు తగ్గుతున్నట్లు సమాచారం. మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కలయికలో సినిమాను కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు సంబంధించి స్క్రిప్టును ఇప్పటికే చిరంజీవి అంగీకరించారని, కొరటాల దానికి మెరుగులు దిద్దుతున్నారని నిర్మాణ సంస్ద పేర్కొంది.  ప్రస్తుతం ‘సైరా నరసింహారెడ్డి’ షూటింగ్‌లో బిజీగా ఉన్న చిరంజీవి.. అది పూర్తికాగానే కొత్త ప్రాజెక్టులో జాయిన్ అవుతారు.