చిరు ఆ టైటిల్ వద్దు అని చెప్తున్నారా..ఎందుకని ?
అడ్వెంచర్ డ్రామాగా రూపొందనున్న ఆ సినిమాకు 'ముల్లోకాల వీరుడు' అనే టైటిల్ అనుకుంటున్నారట. అయితే ఈ టైటిల్
మెగాస్టార్ చిరంజీవి , బింబిసార దర్శకుడు వశిష్ట దర్శకత్వంలో ఓ చిత్రం అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఎక్స్ పెన్సీవ్ మూవీ గా #మెగా157 చెప్తున్నారు. అలాగే పంచభూతాలతో కూడిన అనౌన్స్ మెంట్ పోస్టర్ సోషల్ మీడియా & ఇంటర్నెట్‌లో సెన్సేషన్ సృష్టించింది. ఈ ఫాంటసీ అడ్వెంచర్‌ను యూవీ క్రియేషన్స్ వంశీ, ప్రమోద్, విక్రమ్ భారీ స్థాయిలో నిర్మించనున్నారు. చిత్ర దర్శకుడు వశిష్ట సినిమా ప్రీ-ప్రొడక్షన్ ఫార్మాలిటీస్ ప్రారంభించి శర వేగంగా జరుపుతున్నారు. ఛోటా కె నాయుడు ఈ చిత్రానికి డివోపీగా పని చేస్తున్నారు. ఈ మెగా మాస్ బియాండ్ యూనివర్స్ ప్రాజెక్ట్ కు టైటిల్ ఏం పెట్టబోతున్నారనేది హాట్ టాపిక్ గా మారింది.
మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు .. అడ్వెంచర్ డ్రామాగా రూపొందనున్న ఆ సినిమాకు 'ముల్లోకాల వీరుడు' అనే టైటిల్ అనుకుంటున్నారట. అయితే ఈ టైటిల్ విషయమై అఫీషియల్ ప్రకటన ఏమీ లేదు. మీడియాలో ప్రచారం జరుగుతున్న టైటిల్ మాత్రమే. అయితే ఈ టైటిల్ పట్ల చిరంజీవి అసంతృప్తిగా ఉన్నారని, అందుకే మీడియాకు లీక్ చేసి, వచ్చే స్పందనను బట్టి నిర్ణయం తీసుకుందామనుకున్నారని చెప్పుకుంటున్నారు. అలాగే చిరంజీవి ..‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ని గుర్తు చేసేలా టైటిల్ పెట్టవద్దని క్లియర్ చెప్పినట్లు వినికిడి. రీసెంట్ గా అశ్వనీదత్ ....తమ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’సినిమా విషయమై లీగల్ నోటీస్ ఇవ్వటంతో ఈ డెసిషన్ తీసుకున్నట్లు చెప్తున్నారు.
దర్శకుడు మాట్లాడుతూ...‘‘జగదేక వీరుడు అతిలోక సుందరి (1990) (Jagadeka Veerudu Athiloka Sundari) తర్వాత చిరంజీవిని మనం ఫాంటసీ చిత్రాల్లో చూడలేదు. ఈ సినిమా అప్పటి పిల్లలను బాగా ఆకట్టుకుంది. అందుకే ఈతరం పిల్లలకు చిరంజీవిని అదే తరహాలో చూపించాలనుకుంటున్నా. ఫాంటసీ సినిమాలు, కార్టూన్స్ చూస్తూ, చందమామ కథలు చదువుతూ పెరిగాను. మార్వెల్, డీసీ సూపర్‌హీరోల స్టోరీలు, విఠలాచార్య చిత్రాలను బాగా ఇష్టపడతా. ఓరోజు పాత మిక్కీ మౌస్ కార్టూన్ చూస్తున్న సమయంలో ‘బింబిసార’ సినిమా కథాలోచన వచ్చింది’’ అన్నారు.
అలాగే ‘‘తెరపై ఇలాంటి కొత్త ప్రపంచాన్ని సృష్టించడంలో స్వేచ్ఛ తీసుకోవచ్చు. గుర్రాలు, ఏనుగులు గాల్లో ఎరగడంలాంటి ఎన్నో మ్యాజిక్స్‌ను జోడించవచ్చు. ‘అవతార్’లా కొత్త ప్రపంచాన్ని రూపొందించడం, ప్రేక్షకులను అందులో లీనమయ్యేలా చేయడంలో ఆనందం ఉంది. విజువల్ ఎఫెక్ట్స్‌కు ప్రాధాన్యమున్న ఈ సినిమా కోసం పలు స్టూడియోస్‌తో చర్చలు జరుపుతున్నాం. అయితే అన్నింటికీ మించి స్టోరీ, స్క్రీన్‌ప్లేనే సినిమాకు బలమనేది నా అభిప్రాయం’’ అని పేర్కొన్నారు. నవంబరులో ఈ సినిమా షూటింగ్ ప్రారంభంకానుందని సమాచారం. హీరోయిన్ గా అనుష్క, నయనతార పేర్లు ప్రచారంలో ఉన్నాయి. వీరిద్దరిలో ఒకరు చిరంజీవి సరసన నటించే అవకాశాలున్నాయి. ఇతర తారాగణం, టెక్నికల్ టీంను మేకర్స్ త్వరలో తెలియజేస్తారు.