మెగాాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 151వ చిత్రం ‘సైరా’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఖైదీ నెం.150 మూవీ తరువాత చిరంజీవి.. ఉయ్యల వాడ నరసింహారెడ్డిగా ప్రేక్షకులను అలరించేందుకు మేకోవర్ మొదలుపెట్టాడు. గత ఆగష్టు నెలలో ‘సైరా’ మూవీ లాంఛ్‌ కాగా.. డిసెంబర్ 6 నుండి రెగ్యులర్ షూటింగ్‌కు రెడీ అవుతోంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి కావడంతో చిరు సైరా మూవీ కోసం మేకోవర్‌పై శ్ర‌ద్ధ పెట్టారు. తాజాగా చిరు జిమ్‌లో క‌స‌రత్తులు చేస్తున్న ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. 
 


బ్రిటీష్ పాల‌కుల‌కు వ్య‌తిరేకంగా పోరాడిన తొలి స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహ‌రెడ్డి జీవితంలో ప్రజలకు తెలియని ఎన్నో అద్భుత ఘట్టాలను ఈ సినిమా ద్వారా చూపించనున్నారు దర్శకుడు సురేందర్ రెడ్డి. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ నటిస్తుండటం విశేషం. ఇక హీరోయిన్‌గా నయనతార నటిస్తోంది. జగపతి బాబు, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి, నాజర్, ముకేశ్ రుషి, రఘుబాబు, సుబ్బరాజు తదితర నటీనటులు నటిస్తున్నారు.