మెగాస్టార్ చిరంజీవి సామ్ జామ్ టాక్ షోకి అతిథిగా విచ్చేశారు. అక్కినేని కోడలు సమంత క్రేజీ ప్రశ్నలతో ఆయనను ఇరుకునబెట్టే ప్రయత్నం చేసింది. మీ ఫ్రిజ్ లో ఎప్పుడూ ఉండే ఐటెం ఏమిటని? సమంత చిరంజీవిని అడుగగా ఆయన స్ట్రేంజ్ ఎక్స్ ప్రెషన్ ఇచ్చారు. ఆయన చేతి సైగలు చూసి... సమంత అలాగే ప్రేక్షకులు ఏదేదో ఊహించుకున్నారు. మీరు అనుకున్నది కాదు అంటూ చిరంజీవి కవర్ చేసే ప్రయత్నం చేశారు. కాగా సామ్ జామ్ లో నటుడు వైవా హర్ష చిరంజీవిని మరో కఠినమైన ప్రశ్న అడిగారు. మీరు అనేక హిట్ చిత్రాలలో నటించారు... మీరు నటించిన ఓ మూవీని రీమేక్ చేయాలంటే పర్ఫెక్ట్ హీరో ఎవరని అడుగగా... తడుముకోకుండా చరణ్, తారక్ మరియు ప్రభాస్ అని చెప్పాడు. 

అలాగే పరిశ్రమలో ఉన్న మరికొందరు స్టార్స్ మహేష్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ అలాగే పవన్ కళ్యాణ్ అంటూ డిప్లొమాటిక్ ఆన్సర్ తో తప్పించుకున్నారు. కేవలం చరణ్ పేరు చెవితే కొడుకు కాబట్టి చెప్పాడు అనుకుంటారు. అలా కాదని ఎదో ఒక హీరో పేరు చెవితే మిగతా హీరోల ఫ్యాన్స్ బాధపడతారు. అందుకే చిరంజీవి తెలివిగా అందరూ హీరోల పేర్లు చెప్పారు. ఆహా యాప్ లో దీనికి సంబంధించిన పూర్తి ఎపిసోడ్ చూడవచ్చు. 

మరో వైపు చిరంజీవి ఆచార్య షూటింగ్ లో పాల్గొంటున్నారు. లాక్ డౌన్ తరువాత సుమారు ఏడు నెలలకు ఆచార్య షూటింగ్ తిరిగి ప్రారంభం అయ్యింది. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ కీలక రోల్ చేయడం విశేషం. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా... మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్, మాట్నీ మూవీస్ సంయక్తంగా నిర్మిస్తున్నాయి.