మొన్నటి వరకు రాజమండ్రిలోని మారెడుమిల్లిలో బిజీగా గడిపిన చిరంజీవి ఇప్పుడు ఖమ్మంకి షిఫ్ట్ అయ్యాడు. ఖమ్మంలోని ఇల్లందులోగల జేకే కోల్‌ మైన్స్ లోకి ల్యాండ్‌ అయ్యాడు. అక్కడ వెళ్లడం వెళ్లడంతోనే బిజీగా గడుపుతున్నాడు. ఇదంతా ఆయన హీరోగా నటిస్తున్న `ఆచార్య` చిత్ర షూటింగ్‌ కోసమని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మారెడుమిల్లి అటవి ప్రాంతంలో షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న `ఆచార్య` షూటింగ్‌ ప్రస్తుతం ఇల్లందు కోల్‌ మైన్స్ లో జరుపుకుంటోంది. అందులో భాగంగా సెట్‌కి వెళ్లారు చిరంజీవి. 

అక్కడ జేకే కోల్‌ మైన్స్ అధికారులు చిరంజీవికి స్వాగతం పలికారు. ఇందులో చిరంజీవి బ్లాక్‌ కూలింగ్‌ గ్లాస్‌, తలపై హ్యాట్‌ ధరించారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది. ఇందులో పలు యాక్షన్‌ ఎపిసోడ్ చిత్రీకరించే అవకాశాలున్నాయి. ఈ షెడ్యూల్‌లో చెర్రీ కూడా పాల్గొంటాడని సమాచారం. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న `ఆచార్య` చిత్రంలో కాజల్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా, రామ్‌చరణ్‌ `సిద్ద` అనే కామ్రేడ్‌గా, కీలక పాత్ర పోషిస్తున్నారు. మారెడుమిల్లి అటవి ప్రాంతంలో జరిగిన షెడ్యూల్‌లో చెర్రీ పాల్గొన్న విషయం తెలిసిందే. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌, కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ పతాకంపై నిరంజన్‌రెడ్డి, రామ్‌చరణ్‌ నిర్మిస్తున్నారు. ఇందులో రామ్‌చరణ్‌కి జోడిగా పూజా హెగ్డే కనిపించనున్నారు.