మెగాస్టార్ రాక హైప్ తెస్తుందా?

Chiranjeevi Is Chief Guest For sai dharam tej movie  audio launch
Highlights

సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా, అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా 

సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా, అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా క్రియేటివ్‌ కమర్షియల్స్‌ మూవీ మేకర్స్‌ పతాకంపై ఎ.కరుణాకరన్‌ దర్శకత్వంలో క్రియేటివ్‌ 
ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామారావు నిర్మిస్తున్న చిత్రం 'తేజ్‌'. ఐ లవ్‌ యు అనేది ఉపశీర్షిక. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌లో భాగంగా ఎడిటింగ్‌, డబ్బింగ్‌ జరుగుతోంది. జూన్‌ 29న చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.

'తొలిప్రేమ', 'ఉల్లాసంగా ఉత్సాహంగా', 'డార్లింగ్‌' వంటి రొమాంటిక్‌ మూవీస్‌ని అందించిన ఎ.కరుణాకరన్‌ దర్శకత్వంలో వస్తోన్న మరో రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. మంచి లవ్‌ ఫీల్‌తో సాగే ప్రేమకథా చిత్రంగా 'తేజ్‌ ఐ లవ్‌ యు' రూపొందుతోంది. ఎన్నో మ్యూజిక‌ల్ మెలోడీస్ అందించిన సంగీత ద‌ర్శ‌కుడు గోపీసుంద‌ర్ సంగీత సార‌థ్యంలో ఈ సినిమా పాట‌లు విడుద‌ల కానున్నాయి.

జూన్ 9న హైద‌రాబాద్ జె.ఆర్‌.సి.క‌న్వెన్ష‌న్ సెంట‌ర్‌లో జ‌ర‌గ‌బోతున్న ఈ ఆడియో ఫంక్ష‌న్‌కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు.ఇప్పటివరకు ఈ సినిమాపై హైప్ పెంచడానికి చిత్రబృందం ఎన్ని పాట్లు పడినా వర్కవుట్ మాత్రమే కాలేదు. కనీసం మెగాస్టార్ రాకతో అయినా సినిమాపై అంచనాలు పెరుగుతాయేమో చూడాలి!
 
 

loader