మేడే (May day) సందర్భంగా ఏర్పాటు చేసిన సినీకార్మికోత్సవం(CineKarmikothsavam)లో చిరంజీవి పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆయన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినీ కార్మికుల సేవలను కొనియాడారు.
సినీ కార్మికులకు ఓ టైం అంటూ ఉండదు. మార్నింగ్ సన్ రైజ్ షాట్ ఉందంటే నాలుగు గంటలకే సెట్స్ కి వెళ్లి కావలసిన ఏర్పాట్లు చేస్తారు. ఆర్టిస్టులు ముఖానికి మేకప్ వేసుకొని సిద్ధంగా ఉంటారు. సినిమా కార్మికులు ఓ మూవీ కోసం ఎంతగానో కష్టపడతారు. జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా సమయంలో జ్వరంతో నేను పనిచేశాను. సినిమా విదులకు డేట్ ఫిక్స్ చేశారు. ఓ పాట షూట్ చేయాల్సి ఉంది. మంటలు మండే మలేరియా జ్వరంలో కూడా స్టూడియోకి వచ్చి శ్రీదేవితో స్టెప్స్ వేశాను. డాక్టర్స్ పర్యవేక్షణలో నాలుగైదు రోజులు షూటింగ్ లో పాల్గొన్నాను.
సాంగ్ పూర్తయ్యాక విజయ వాహిని స్టూడియోస్ ఎదురుగా ఉన్న విజయా హాస్పటల్ లో పడ్డాను. దాదాపు 15 రోజులు లేవలేదు. ఇటీవల కూడా ముంబైలో సల్మాన్ ఖాన్ తో వారం రోజులు పాటు డైలీ నైట్ షూట్ లో పాల్గొన్నాను. వెంటనే హైదరాబాద్ వచ్చి మైత్రి మూవీ మేకర్స్ షూటింగ్ లో పాల్గొన్నాను. సాయంత్రం 7 గంటల సమయంలో నేను కొంచెం డల్ గా ఉండడం గమనించి నా మేనేజర్ ని అడిగారట. ఆయన నాన్ స్టాప్ గా వర్క్ చేస్తున్నారని చెప్పాడట. ఆ విషయం తెలిసి నేను మేనేజర్ పై కోప్పడ్డాను. నేను అలసటగా ఉన్నానని తెలిస్తే రెస్ట్ తీసుకోమని ఇంటికి పంపిస్తారు. ఎందుకు చెప్పావని అరిచాను.. అంటూ చిరంజీవి యాక్టర్స్ గా తాము ఎంత కష్టపడతారో వివరించారు.
ఇక పరిశ్రమ తరపున సినీ కార్మికులకు చేసిన సేవలను చిరంజీవి (Chiranjeevi)గుర్తు చేశారు. అలాగే చిత్రపురి కాలనీలో హాస్పిటల్ నిర్మించనున్నట్లు వెల్లడించారు. కాగా 67 ఏళ్ల వయసులో కూడా చిరంజీవి యంగ్ హీరోలకు మించి చిత్రాలు చేస్తున్నారు. ఆచార్య (Acharya)మూవీ విడుదల కాగా... గాడ్ ఫాదర్, భోళా శంకర్, చిరు 154 చిత్రాలు సెట్స్ పై ఉన్నాయి. అలాగే యువ దర్శకుడు వెంకీ కుడుములతో ఓ మూవీ ప్రకటించారు.
