Asianet News TeluguAsianet News Telugu

Godfather: ప్రీరిలీజ్ బిజినెస్ ఎంత.. ఎంతొస్తే హిట్ అవుతుంది?

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘గాడ్‌ఫాదర్’ మరికొద్ది గంటల్లో ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కించగా, చిరు ఈ సినిమాలో సరికొత్త అవతారంలో కనిపిస్తున్నాడు. 

Chiranjeevi God father movie pre release business
Author
First Published Oct 4, 2022, 2:07 PM IST

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘గాడ్ ఫాదర్’ అక్టోబర్ 5న దసరా కానుకగా విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఇందులో సల్మాన్ ఖాన్ కూడా నటించడం విశేషం. ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్టైన ‘లూసిఫర్’ సినిమాకి రీమేక్. గాడ్ ఫాదర్ సినిమాపై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ కావడంతో, ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరిగినట్లుగా చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఆచార్య ఇంపాక్ట్ ఏమీ లేదని అంటున్నారు.
 
ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు...తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ గాడ్ ఫాదర్ కి ప్రీరిలీజ్ బిజినెస్ బాగా జరిగింది. ఓవర్సీస్‌లోనూ భారీ రేటుకు ఈ చిత్ర హక్కులను అక్కడి డిస్ట్రిబ్యూటర్లు కొనుగోలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా గాడ్ ఫాదర్ చిత్రం రూ.90 కోట్ల మేర ప్రీరిలీజ్ బిజినెస్ జరిపినట్లుగా తెలుస్తోంది.  ఏరియాల వారీగా ఈ చిత్ర ప్రీరిలీజ్ బిజినెస్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

నైజాం – 22 కోట్లు
సీడెడ్ – 13.50 కోట్లు
ఆంధ్ర – 35 కోట్లు
ఏపీ+తెలంగాణ – 70.50 కోట్ల వరకు బిజినెస్ జరిగినట్లు సమాచారం.
కర్ణాటక – 6.50 కోట్లు
హిందీ – 6.50 కోట్లు
ఓవర్సీస్ – 7.50 కోట్లు
ప్రపంచవ్యాప్తంగా రూ.90 కోట్ల వరకు బిజినెస్ జరిగినట్లుగా చిత్ర వర్గాలు వెల్లడించాయి.

అంటే ఈ సినిమా తొంబై క్టోలు దాటితేనే హిట్ అయ్యినట్లు లెక్క.  ఈ సినిమాలో చిరు ఓ సరికొత్త లుక్‌లో కనిపిస్తుండగా, బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో మెగా ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులకూ ఓ అదిరిపోయే సర్‌ప్రైజ్ ఎలిమెంట్ ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఇటీవల గాడ్‌ఫాదర్ హిందీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో చిరు, సల్మాన్ ఖాన్‌లు ఈ సర్‌ప్రైజ్ ఏమిటో రివీల్ చేశారు. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ కేమియో పాత్రలో కనిపించనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సినిమాలో చరణ్ ఎప్పుడు కనిపిస్తాడా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఇక ఈ సినిమాలో అందాల భామ నయనతార, సత్యదేవ్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios