Asianet News TeluguAsianet News Telugu

chiranjeevi: కరోనాతో పోరాడుతున్న శివశంకర్‌ మాస్టర్‌కి చిరంజీవి సాయం..

ప్రముఖ కొరియోగ్రాఫర్‌ శివశంకర్‌ మాస్టర్‌ ని ఆదుకున్నారు. ఆయన ఆనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కష్టాల్లో ఉన్నా శివశంకర్‌ మాస్టర్ ని ఆదుకున్నారు చిరంజీవి.

chiranjeevi donate three lakhs to siva shankar master
Author
Hyderabad, First Published Nov 26, 2021, 7:21 PM IST

ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం ముందుంటారు చిరంజీవి(Chiranjeevi). చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్‌, ఐ బ్యాంక్‌, చిరంజీవి చారిటబుల్‌ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇవి కావని వ్యక్తిగతంగానూ ఆయన ఆపదలో తలుపుతట్టిన వారికి నేనున్నానంటూ భరోసా ఇస్తున్నారు. తనవంతు సాయం చేస్తున్నారు. తాజాగా ప్రముఖ కొరియోగ్రాఫర్‌ శివశంకర్‌ మాస్టర్‌ (Siva Shankar Master)ని ఆదుకున్నారు. ఆయన ఆనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కష్టాల్లో ఉన్నా శివశంకర్‌ మాస్టర్ ని ఆదుకున్నారు చిరంజీవి. మూడు లక్షల సాయం అందజేశారు.

ప్రముఖ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ కరోనా కారణంగా ప్రస్తుతం హాస్పిటల్ పాలైన సంగతి తెలిసిందే. కరోనా బారిన పడిన ఆయన గచ్చిబౌలిలోని ఏ ఐ జి హాస్పిటల్ లో క్రిటికల్ కేర్ లో వెంటిలేటర్ మీద చికిత్స పొందుతున్నారు. దురదృష్టవశాత్తు ఆయన భార్యకి కూడా కరోనా సోకడంతో ఆమె ఇంట్లోనే హోమ్ క్వారంటైన్‌ లో ఉంటున్నారు. శివ శంకర్ మాస్టర్ పెద్ద కుమారుడికి కూడా కరోనా సోకడంతో ఆయన కూడా వెంటిలేటర్ మీద చికిత్స పొందుతున్నారు. ఈ కుటుంబానికి చికిత్స కోసం రోజుకు లక్ష రూపాయలు ఖర్చు అవుతుండడంతో శివ శంకర్ మాస్టర్ చిన్న కుమారుడు అజయ్ తనకు సహాయం అందించవలసిందిగా సినీ పెద్దలను కోరారు. 

విషయం తెలిసిన వెంటనే Chiaranjeevi హుటాహుటిన అజయ్ కి ఫోన్ చేసి ఇంటికి పిలిపించుకున్నారు. తక్షణ సాయంగా మూడు లక్షల రూపాయల చెక్కుని మెగాస్టార్ చిరంజీవి శివ శంకర్ మాస్టర్ కుటుంబానికి అందజేశారు. అంతేకాక వైద్యానికి సంబంధించి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. శివ శంకర్ మాస్టర్ కు మేమంతా ఉన్నామంటూని అభయమిచ్చారు. చిరంజీవిని కలిసి చెక్ తీసుకున్న తర్వాత అజయ్ మాట్లాడుతూ "నాన్న గారికి అనారోగ్యం అనే సంగతి తెలిసిన వెంటనే చిరంజీవి గారు ఫోన్ చేసి పిలిపించారని, తక్షణ సాయంగా మూడు లక్షల రూపాయల చెక్కును అందించారు అని వెల్లడించారు. 

చిరంజీవి గారు అంటే నాన్న గారికి ఎంతో అభిమానం అని పేర్కొన్న అజయ్ చిరంజీవి గారితో నాన్న గారు చాలా సినిమాలకు పనిచేశారని తెలిపారు. ఇటీవల `ఆచార్య` షూటింగులో కూడా నాన్నగారు చిరంజీవిని కలిశారని అజయ్ గుర్తుచేసుకున్నారు. ఇలాంటి సమయంలో ప్రతి రూపాయి తనకి చాలా అవసరం అని పేర్కొన్న అజయ్ చిరంజీవి గారు చేసిన సాయం ఎన్నటికీ మరువలేని, ఆయనకి ఎన్నటికీ రుణపడి ఉంటానని చెప్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios