గతేడాది క‌రోనా క్రైసిస్ క‌ష్ట‌కాలంలో సీసీసీ ద్వారా సినీ కార్మికుల‌ను ఆదుకోవడంలో ముందున్నారు చిరంజీవి. త్వరలో క‌రోనా రోగులను ఆదుకునేందుకు ఆక్సిజ‌న్ ఉత్ప‌త్తి ప్లాంట్ ను ఏర్పాటు చేసేందుకు రెడీ అవుతున్నారు. మరోవైపు కరోనా సెకండ్‌ వేవ్‌లో ధీనస్థితిలో ఉన్న పావ‌ల శ్యామ‌ల‌కు, అలాగే  కోరోనాతో మృతి చెందిన ప‌లువురు వీరాభిమానుల కుటుంబాల‌ను ఆదుకుంటున్నారు. కోరోనా వచ్చి ఇబ్బంది పడుతున్న అభిమానులకు ల‌క్ష‌ల్లో సాయం చేశారు. తన అభిమాని వార‌సులు పేరిట ఫిక్స్ డ్ డిపాజిట్లు చేశారు. ఇబ్బందుల్లో ఉన్న వారిని ఆదుకునేందుకు చిరంజీవి చారిట‌బుల్ ట్ర‌స్ట్ ద్వారా  సేవ‌ల్ని అనంతంగా చేస్తున్నారు. 

గతంలోనూ పలువురు జ‌ర్న‌లిస్టుల‌కు సాయం అందించిన చిరంజీవి తాజాగా భ‌ర‌త్ భూష‌ణ్ అనే ఫోటో జ‌ర్న‌లిస్ట్ రూ.50 వేల ఆర్థిక సాయం అందించారు. ఆయన ఆపదలో ఉన్నారని తెలిసి తనవంతు సాయంతో అందించారు. ఈ చెక్కును చిరంజీవి యువత అధ్యక్షుడు రవణం స్వామి నాయుడు భరత్ భూషణ్ కి అందజేశారు.  సాయం అందుకున్న భ‌ర‌త్ భూష‌ణ్ మాట్లాడుతూ, ఆప‌ద్భాంద‌వుడిలా ఈ క‌ష్ట‌కాలంలో చిరంజీవి గారు మ‌మ్మ‌ల్ని ఆదుకున్నందుకు రుణ‌ప‌డి ఉన్నాము. ఆయ‌న పెద్ద‌మ‌న‌సుకు కృత‌జ్ఞ‌త‌లు` అని తెలిపారు. ప్రస్తుతం భరత్‌ భూషణ్‌ కీమో థెరపీ చికిత్స తీసుకుంటున్నారు.