మెగాస్టార్ చిరంజీవి గురించి ఆయన కూతురు, `వాల్తేర్‌ వీరయ్య` కాస్ట్యూమ్‌ డిజైనర్‌ సుస్మిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  తమకే ఛాలెంజ్‌ ఇసురుతున్నారని తెలిపారు.

మెగాస్టార్‌ చిరంజీవి నటించిన `వాల్తేర్‌ వీరయ్య` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ వైజాగ్‌లో గ్రాండ్‌గా జరుగుతుంది. ఈ సినిమాకి కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా పనిచేసి సుస్మిత(చిరంజీవి కూతురు) మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దర్శకుడు బాబీ కథ చెప్పినప్పుడు ఇన్ని సినిమాల్లో ఆయన్ని చూపించిన తర్వాత ఇంకా కొత్తగా, యంగ్‌గా చూపించాలనిపించింది. ఓ అభిమానిగా ఆయన్ని ఎంత స్టయిలీష్‌గా చూపించాలో అలా చూపించాలనుకున్నా. 

సినిమాల్లో ఒకలా చూపించాం. కానీ పాటల్లో చాలా స్టయిలీష్‌గా చూపించాలనుకున్నా. ఇన్ని చేశారు. ఇంకా యంగ్గా చూపించాలని ఇన్‌స్పైర్‌ అవ్వాలనుకున్న ప్రతి సారి ఆయన్ని చూస్తాను. ఆయన పర్సనాలిటీ ఇంకా యంగ్‌ గా యంగ్‌గా అవుతూనే ఉంది. ఆయనకు తగ్గ కాస్ట్యూమ్స్ చేయాలంటే నా టాలెంట్‌ని ఇంకా బెటర్‌ చేసుకోవాలనిపిస్తుంది. నాన్నగారే నాకు ఛాలెంజెస్‌ ఇస్తుంటారు. ఈ అవకాశం ఇచ్చిన మైత్రీ మూవీ మేకర్స్‌ కి ధన్యవాదాలు. ఈ సినిమాకి బాబీగారితో పనిచేయడం ఆనందంగా ఉంది. ఆయన నాకు బ్రదర్‌ లాంటివారు అని తెలిపింది సుస్మిత. 

చిరంజీవి, రవితేజ హీరోలుగా, శృతి హాసన్‌, కేథరిన్‌ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించారు. ఈ చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ఆదివారం సాయంత్రం వైజాగ్‌లో జరుగుతుంది. ఇక సినిమా ఈ నెల 13న విడుదల కానుంది. 

YouTube video player