శ్రీజ.. వరుణ్‌తేజ్‌తోపాటు వైష్ణవ్‌ తేజ్‌తో కలిసి దిగిన రీసెంట్‌ ఫోటోని పంచుకుంది. ఇందులో ఈ ముగ్గురు ఎంతో చూడముచ్చటగా, హ్యాపీగా ఉన్నారు. దీంతోపాటు చిన్ననాటి ఫోటోని పంచుకుంది. 

మెగాస్టార్‌ చిరంజీవి(Chiranjeevi) తనయ శ్రీజ(Sreeja).. తన సోదరుడు వరుణ్‌ తేజ్‌(Varun Tej)ని సర్‌ప్రైజ్‌ చేసింది. ఆయనకు ఊహించని గిఫ్ట్ ఇచ్చి ఆశ్చర్యానికి గురి చేసింది. Varun Tej Birthday నేడు(జనవరి 19). ఈ సందర్భంగా ఆయనకు బర్త్ డే విషెస్‌ తెలిపింది శ్రీజ. ఈ మేరకు ఆమె ఓ ఎమోషనల్‌ పోస్ట్ ని పంచుకుంది. `పుట్టిన రోజు శుభాకాంక్షలు తమ్ముడు. పొడుగ్గా ఉన్నంత మాత్రాన తెలివైన వాళ్లమని అనిపించుకోలేరు. అందుకే నీ కోసం నేను ఉన్నాను. నా బాల్యాన్ని ఎంతో సంతోషంగా గడిచేలా చేశావు. నాకు అన్ని రకాలుగా సపోర్ట్ గా ఉన్నావు. ఎంతో ప్రేమించావు. నీ మీద నాకు మాటల్లో చెప్పలేనంత ప్రేమ ఉంది` అంటూ ఎమోషనల్‌ పోస్ట్ ని పంచుకుంది శ్రీజ.

View post on Instagram

అయితే ఈ సందర్భంగా ఆమె వరుణ్‌తేజ్‌తోపాటు వైష్ణవ్‌ తేజ్‌తో కలిసి దిగిన రీసెంట్‌ ఫోటోని పంచుకుంది. ఇందులో ఈ ముగ్గురు ఎంతో చూడముచ్చటగా, హ్యాపీగా ఉన్నారు. దీంతోపాటు చిన్ననాటి ఫోటోని పంచుకుంది. వరుణ్‌తేజ్‌, శ్రీజ చిన్నప్పటి ఫోటో ఇది. ఇద్దరు నవ్వులు చిందుతూ ఎంతో క్యూట్‌గా ఉన్నారు. ఈ ఫోటోకి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వరుణ్‌ చిన్ననాటి ఫోటో కావడంతో మెగా అభిమానులు, వరుణ్‌ తేజ్‌ అభిమానులు మరింతగా సర్‌ప్రైజ్‌ అవుతున్నారు. 

మరోవైపు వరుణ్‌ తేజ్‌ బర్త్ డే కానుకగా ఆయన నటిస్తున్న చిత్రాల అప్‌డేట్లతో అభిమానులను ఖుషీ చేశాయి చిత్ర యూనిట్స్. `ఎఫ్‌3` నుంచి స్పెషల్‌ బర్త్ డే విషెస్‌ తెలియజేస్తూ ఓ వీడియోని పంచుకున్నారు. అలాగే `గని` చిత్రం నుంచి బర్త్ డే స్పెషల్‌ గ్లింప్స్ ని విడుదల చేశారు. ఇవి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. మరోవైపు వరుణ్‌కి బర్త్ డే విషెస్‌లు వెల్లువెత్తుతున్నాయి. చిరంజీవి, చరణ్‌, నాగబాబు, సాయితేజ్‌, నిహారిక సోషల్‌ మీడియా ద్వారా వరుణ్‌ తేజ్‌కి బర్త్‌డే విషెస్‌ తెలియజేశారు. 

ఇదిలా ఉంటే శ్రీజ ఇటీవల వార్తల్లో నిలిచింది. ఆమె తన సోషల్‌ మీడియా అకౌంట్‌ నుంచి భర్త కళ్యాణ్‌ దేవ్‌ పేరుని తొలగించడం హాట్‌ టాపిక్‌ అయ్యింది. వీరిద్దరి మధ్య మనస్పర్థాలు స్టార్ట్ అయ్యాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చాలా రోజులుగా కళ్యాణ్‌ దేవ్‌ యాక్టివ్‌గా లేదు. ఆయన ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. ఇటీవల సంక్రాంతికి ఆయన నటించిన `సూపర్‌ మచ్చి` చిత్రం విడుదలైంది. ఆ సమయంలోనూ కళ్యాణ్‌ దేవ్‌ కనిపించలేదు. పైగా ఈ చిత్రానికి మెగా ఫ్యామిలీ నుంచి ఎలాంటి సపోర్ట్ లేదు. దీంతో నెటిజన్ల నుంచి పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఏం జరగబోతుందనేది వేచి చూడాలి.