Asianet News TeluguAsianet News Telugu

చిరు డాన్స్ కేకే కానీ చివర్లోనే,ట్రోలింగ్ చేస్తున్నారు

ప్రముఖ ఇండియన్‌ ర్యాపర్‌ రాజకుమారి జవాన్‌ చిత్రంలోని టైటిల్‌ సాంగ్‌  పాడుతూండగా మెగాస్టార్‌ వేసిన స్టెప్పులు పార్టీలోనే హైలైట్‌ 

Chiranjeevi Dances To Jawan Song At Diwali Party With Raja Kumari jsp
Author
First Published Nov 15, 2023, 1:20 PM IST


మెగాస్టార్‌ చిరంజీవి డాన్స్ లు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. ఆయనలో నడుడుకు మాత్రమే కాదు డాన్సర్ కు కూడా వీరాభిమానులు ఉన్నారు. ఇప్పటికి ఈయన సినిమాల్లో డాన్స్ లు చూసి ఆశ్చర్యపోతూంటారు. 68 ఏళ్ల వయసులోనూ ఎక్కడా గ్రేస్ తగ్గకుండా వేసే స్టెప్స్ చూసి ఫ్యాన్స్ మురిసిపోతూంటారు. ఇక కేవలం తెరమీదే కాదు ఆయన తెరవెనక కూడా చాలా జోష్ గా ఉంటారు.  తాజాగా చిరంజీవి దీపావళి పార్టీలో కొద్ది సేపు డాన్స్ చేసారు. షారుక్‌ ఖాన్‌ జవాన్‌ సినిమాలోని పాటకు జోష్‌తో స్టెప్పులేశాడు. ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఆ వీడియో చివర్లో ర్యాపర్ రాజకుమారికి హగ్ ఇచ్చేటప్పుడు మాత్రం చిన్న పొరపాటు దొర్లింది. అదే ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు యాంటి ఫ్యాన్స్. నిజానికి అది క్యాజువల్ గా అనుకోకుండా జరిగిన మూవ్ మెంట్  అయినా పెద్దది చేస్తున్నారు. బ్యాడ్ టచ్ అంటూ ఆ వీడియోలో బిట్ కచ్ చేసి వైరల్ చేస్తున్నారు. మీరూ ఆ వీడియో చూడండి.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Raja Kumari (@therajakumari)

 
ఈ వీడియోలో ప్రముఖ ఇండియన్‌ ర్యాపర్‌ రాజకుమారి జవాన్‌ చిత్రంలోని టైటిల్‌ సాంగ్‌  పాడుతూండగా మెగాస్టార్‌ వేసిన స్టెప్పులు పార్టీలోనే హైలైట్‌గా అని చెప్పాలి. రాజకుమారి ఉషారుకి తగ్గట్లు అంతే జోష్ తో చిరు డ్యాన్స్‌ చేశాడు. మరో ప్రక్క రామ్‌చరణ్‌ తండ్రిని ఎంకరేజ్‌ చేస్తూ కనిపించాడు.  ఆ చిన్న విషయం ప్రక్కన పెడితే  మెగాస్టార్‌ స్వాగ్‌కు ఫిదా అయిపోతున్నారు.ఇక ఈ పార్టీ జరిగింది మెగాస్టార్‌ ఇంట్లోనే. తన మనమరాలు  క్లీంకార పుట్టిన తర్వాత వచ్చిన తొలి దీపావళి పండగ కావడంతో ఎంతో ఘనంగా వేడుక నిర్వహించారు. ఈ పార్టీకి స్టార్‌ హీరోలు మహేశ్‌బాబు, వెంకటేశ్‌, ఎన్టీఆర్‌తో పాటు మంచు లక్ష్మి తదితరులు విచ్చారు. 

 

ఇక ఈ విషయం ప్రక్కన పెడితే.... మెగాస్టార్ చిరంజీవి కి ఈ సంవత్సరం బాగా కలిసి వచ్చింది.   'వాల్తేరు వీరయ్య' లాంటి సూపర్‌హిట్ వచ్చింది.అదే సమయంలో  ఎంతో మోజు పడి చేసిన  'భోళా శంకర్' డిజాస్టర్ అయింది. రీసెంట్ గా ఓ కొత్త మూవీని లాంచ్ చేశాడు.  'బింబిసార' ఫేమ్ వశిష‍్ట దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. దసరా సందర్భంగా మంగళవారం లాంఛనంగా ఈ ప్రాజెక్ట్ మొదలైంది. కీరవాణితో మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా స్టార్ట్ చేశారు. ముల్లోకాల నేపథ్య కథతో తీస్తున్న ఈ ఫాంటసీ సినిమాలో చిరు డిఫరెంట్ లుక్స్‌లో కనిపించబోతున్నారు. రూ.200 కోట్ల బడ్జెట్ అంటున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios