Asianet News TeluguAsianet News Telugu

సవాళ్లని ఎదురించి నటుడిగా నిలబడి.. పొట్టి వీరయ్యకి చిరంజీవి సంతాపం

దాదాపు 300వందలకుపైగా చిత్రాల్లో నటించి తనేంటో నిరూపించుకున్నారు పొట్టి వీరయ్య. ఈ సందర్భంగా ఆయన నటన, చిత్ర పరిశ్రమకు చేసిన సేవలను చిరంజీవి గుర్తు చేసుకున్నారు. సంతాపం తెలిపారు. 
 

chiranjeevi condolence to potti veerayya arj
Author
Hyderabad, First Published Apr 26, 2021, 10:58 AM IST

`వ్యక్తిగతంగా, వృతి పరంగా ఎన్నో సవాళ్లని ఎదురించి పొట్టివీరయ్య తెలుగు చిత్ర పరిశ్రమలో నిలబడ్డాడు. తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నార`ని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. నటుడు పొట్టి వీరయ్య అనారోగ్యంతో ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో కన్నుమూసిన విషయం తెలిసిందే. దాదాపు 300వందలకుపైగా చిత్రాల్లో నటించి తనేంటో నిరూపించుకున్నారు పొట్టి వీరయ్య. ఈ సందర్భంగా ఆయన నటన, చిత్ర పరిశ్రమకు చేసిన సేవలను చిరంజీవి గుర్తు చేసుకున్నారు. సంతాపం తెలిపారు. 

`వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎన్నో  సవాళ్ళను అధిగమించి, మూడు వందలకు పైగా చిత్రాల్లో నటించి, తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న పొట్టి వీరయ్య  మృతి నన్ను ఎంతో  కలచి వేసింది. ఆయన  కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం తెలియచేస్తున్నా. ఆయ‌న‌ ఆత్మకి శాంతి కలగాలని ఆ భగవంతుడిని కోరుకొంటున్నా` అని అన్నారు. సినిమా వాళ్లే లేకపోతే నేను ఎప్పుడో చనిపోయే వాడిన‌ని .. చిరంజీవి గారు స్థాపించిన మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ వల్లే నేను ఈరోజు బతుకుతున్నా అని గతంలో ఓ ఇంట‌ర్వ్యూలో పొట్టి వీరయ్య వెల్ల‌డించారు. సినిమాల్లో నటిస్తేనే డబ్బులు వస్తాయి. తరువాత ఉండవు. ఈ మధ్య  నేను అనారోగ్యంతో ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నానని  తెలుసుకుని మెగాస్టార్ చిరంజీవి గారు రెండు లక్షల రూపాయల ఆర్థిక సాయం కూడా అందించార‌ని పొట్టి వీరయ్య  తెలిపారు. 

ఆయన భౌతిక కాయానికి అంత్య క్రియలు నేడు(సోమవారం) జరుపనున్నట్టు కుటుం సభ్యులు తెలిపారు. తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలోని ఫానిగిరి గ్రామానికి చెందిన గట్టు వీరయ్య చిన్నప్పటి నుంచీ రంగస్థల క‌ళాకారుడు. సినీరంగంలో ద‌శాబ్ధాల పాటు ఆయ‌న సేవ‌లందించారు. ప‌రిశ్ర‌మ‌కు సుదీర్ఘ కాలం సేవ‌లందించిన వీర‌య్య మృతి ప‌ట్ల పలువురు సినీ ప్రముఖులు సైతం సంతాపం తెలిపారు. రాజశేఖర్‌, జీవిత ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళ్లర్పించారు.

Follow Us:
Download App:
  • android
  • ios