హద్దులు లేని ఆనందంలో మెగాస్టార్..

హద్దులు లేని ఆనందంలో మెగాస్టార్..

 

మెగా అభిమానుల నిరీక్షణకు తెరదించేస్తూ .. 'రంగస్థలం' మూవీ నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు రాష్ట్రాలతో పాటు యూఎస్ లోను ఈ సినిమా తన హవాను కొనసాగిస్తోంది. వసూళ్ల పరంగానే కాదు .. నటన పరంగాను ఈ సినిమా చరణ్ కి మంచి పేరు తెచ్చిపెట్టింది. చరణ్ లోని నటుడిని ఈ సినిమా పూర్తిస్థాయిలో ఆవిష్కరించిందనే టాక్ ఇండస్ట్రీలోను వినిపిస్తోంది. ఈ సినిమాకి ఈ స్థాయి రెస్పాన్స్ వస్తుండటంతో చిరంజీవి ఆనందంతో పొంగిపోతున్నారు.

 చిట్టిబాబు పాత్రకి చరణ్ ప్రాణప్రతిష్ఠ చేశాడంటూ ప్రేక్షకులు నీరాజనాలు పడుతుండటంతో చిరంజీవి సంతోషంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఈ సంతోషాన్ని ఆయన సుకుమార్ .. చరణ్ .. సందీప్ రెడ్డి వంగా .. వంశీ పైడిపల్లితో కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. ఇలా ఒక వైపున మెగా ఫ్యామిలీ సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటే .. మరోవైపున థియేటర్స్ దగ్గర మెగా అభిమానుల సందడి కొనసాగుతూనే వుంది.        

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos