Asianet News TeluguAsianet News Telugu

భార్య సురేఖకి చిరంజీవి బర్త్ డే విషెస్‌.. ఆయన కవిత్వ, ప్రాసలు చూస్తే మతిపోవాల్సిందే.. పోస్ట్ వైరల్‌

మెగాస్టార్‌ చిరంజీవి వైఫ్‌ సురేఖ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా భార్యకి బర్త్ డే విషెస్‌ తెలిపారు చిరంజీవి. ఈ సందర్భంగా చేసిన పోస్ట్ వైరల్‌ అవుతుంది. 

chiranjeevi birthday wishes to wife surekha with crazy words post viral arj
Author
First Published Feb 18, 2024, 3:13 PM IST | Last Updated Feb 18, 2024, 3:13 PM IST

మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ నేడు పుట్టిన రోజు జరుపుకుంటుంది. ఈ సందర్భంగా భార్యకి బర్త్ డే విషెస్‌ చెప్పారు చిరంజీవి. అయితే ఆయన పెట్టిన విషెస్‌ పోస్ట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వైరల్‌ అవుతుంది. ఇందులో చిరు యాస, ప్రాస, కవిత్వం అదిరిపోయేలా ఉంది. మరి ఇంతకి చిరు ఏం పోస్ట్ చేశాడనేది చూస్తే..

చిరంజీవి భార్య పేరు సురేఖ.. `రేఖ` అనే పదాలు వచ్చేలా ఆయన కవిత్వాన్ని మేళవించి విషెస్‌ నోట్‌ రాయడం విశేషం. `నా జీవన రేఖ, నా సౌభాగ్య రేఖ, నా భాగస్వామి సురేఖ` అని పేర్కొన్నారు. `నా లైఫ్‌ లైన్‌, నా బలం వెనకున్న గొప్ప పిల్లర్‌ అయిన సురేఖకి పుట్టిన రోజు శుభాకాంక్షలు అని తెలిపారు చిరు. ఇందులో సింపుల్‌గా మూడు పదాల్లోనే తన అర్థాన్ని తమ బంధాన్ని తెలిపారు చిరు. చాలా గొప్పగా చెప్పారు. దీంతో ఫ్యాన్స్ ఖుషి అవుతూ పోస్ట్ వైరల్‌ చేస్తున్నారు. ఆమెకి బర్త్ డే విషెస్‌ చెబుతున్నారు.  

మెగాస్టార్ చిరంజీవి, సురేఖ 1980 ఫిబ్రవరి 20న పెళ్లిచేసుకున్నారు. మ్యారేజ్‌ జరిగి 44ఏళ్లు అవుతుంది. మరో రెండు రోజుల్లో వారి పెళ్లి రోజు. దీంతో వీరింట్లో పండగ వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. వీరికి సుస్మిత, రామ్‌చరణ్‌, శ్రీజ జన్మించారు. రామ్‌ చరణ్‌ ఇప్పుడు టాలీవుడ్‌ స్టార్‌ హీరోగా, గ్లోబల్‌ స్టార్‌గా రాణిస్తున్నారు. సుస్మిత కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా వర్క్ చేస్తుంది. నిర్మాణంలోకి అడుగుపెడుతుంది. మరోవైపు శ్రీజని కూడా సెట్‌ చేసే పనిలో ఉన్నాడు చిరు. 

ఇక ప్రస్తుతం చిరంజీవి `విశ్వంభర` చిత్రంలో నటిస్తున్నారు. `భోళా శంకర్‌` వంటి డిజాస్టర్‌ తర్వాత ఆయన్నుంచి వస్తోన్న మూవీ ఇది. చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. వశిష్ట దర్శకుడు. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుంది. సోషియో ఫాంటసీగా ఈ మూవీ రూపొందుతుంది. ఇందులో చిరంజీవి పాత్ర, కథా నేపథ్యం అదిరిపోయేలా ఉంటుందని తెలుస్తుంది. 

Read more: SSMB29: మహేష్‌ ఫ్యాన్స్ నిరాశ చెందే వార్త వైరల్‌.. అసలు నిజం ఏంటి? రాజమౌళి సినిమా ఎప్పుడు స్టార్ట్ అంటే?
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios