ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కి మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. కానీ బన్నీ ఫ్యాన్స్ మాత్రం అసంతృప్తితో ఉన్నారు. అది మిస్ చేయడం పట్ల వాళ్లు నిరాశ చెందుతున్నారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నేడు (ఏప్రిల్8) తన 41వ పుట్టిన రోజుని జరుపుకుంటున్నారు. `పుష్ప` వంటి పెద్ద హిట్ తర్వాత దానికి కొనసాగింపుగా `పుష్ప2` భారీ స్థాయిలో చేస్తున్న నేపథ్యంలో బన్నీ బర్త్ డే చాలా స్పెషల్‌గా మారింది. తన బర్త్ డే సందర్భంగా ఒక్క రోజు ముందుగానే తన అభిమానులకు ట్రీట్ ఇచ్చాడు బన్నీ. `పుష్ప2` నుంచి కాన్సెప్ట్ టీజర్, ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. ఈ రెండు నెట్టింట దుమ్మురేపుతున్నాయి.
ఇదిలా ఉంటే బన్నీ బర్త్ డే విషెస్‌ల వెల్లువ సాగుతుంది. ఈ నేపథ్యంలో బన్నీ మామయ్య, మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా విషెస్ తెలిపారు. హ్యాపీ బర్త్ డే అల్లు అర్జున్, మెనీ హ్యాపీ రిటర్న్స్ అని పేర్కొన్నారు. దీంతోపాటు `పుష్ప2ః ది రూల్` ఫస్ట్ లుక్ రాక్ అంటూ ప్రత్యేకంగా మెన్షన్ చేశారు. ఆయనకు అభినందనలు తెలిపారు. ప్రస్తుతం చిరంజీవి ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
అయితే ఈ సందర్భంగా బన్నీ ఫ్యాన్స్ ఓ విషయంలో నిరాశ చెందుతున్నారు. మెగాస్టార్ బర్త్ డే విషెస్ చెప్పడం పట్ల వారు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో ఎలాంటి ఫోటో లేకుండా కేవలం విషెస్ నోట్ పేర్కొనడం పట్ల కాస్త అసంతృప్తికి లోనవుతున్నారు. ఏదైనా రేర్ ఫోటో ఉంటే పోస్ట్ చేయోచ్చు కదా అని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఫోటో పోస్ట్ చేస్తే బాగుండేదని, ఒక్క ఎప్పుడూ చూడని ఫోటోని పోస్ట్ చేయండి అంటున్నారు. ఫోటో వేయ్ బాసూ అంటున్నారు. ఈ విషయంలో వాళ్లు నిరాశ చెందినట్టు తెలుస్తుంది.
ఇక బన్నీకి.. పెద్ద ఇన్‌స్పిరేషన్ మెగాస్టార్ చిరంజీవి అనే విషయం తెలిసిందే. తరచూ ఈ విషయాన్ని బన్నీ చెబుతూ వస్తుంటారు. అల్లు అర్జున్.. లెజెండరీ నటుడు అల్లు రామలింగయ్య వారసత్వాన్ని పునికి పుచ్చుకుని సినిమాల్లోకి వచ్చినా, తమకు మాత్రం చిరంజీవినే గాడ్ ఫాదర్‌గా భావిస్తుంటారు. ఇక బన్నీ ప్రస్తుతం `పుష్ప2`లో నటిస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం చిత్రీకరణ దశలో ఉంది.
నిన్న విడుదల చేసిన కాన్సెప్ట్ టీజర్, ఫస్ట్ లుక్ ఆకట్టుకుంటున్నాయి. అయితే టీజర్‌లో బన్నీ లుక్, కొత్త పోస్టర్‌లో ఆయన లేడీ గెటప్ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. సినిమాపై అంచనాలను పెంచుతుంది. అయితే పోలీసుల నుంచి తప్పించుకుని, గుర్తు పట్టకుండా ఉండేందుకు బన్నీ హిజ్రాల గెటప్‌లో కనిపిస్తాడా అనేది అనుమానాలు కలుగుతున్నాయి. మరి ఏది నిజమనేది మున్ముందు తేలనుంది. రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ఫహద్ ఫాజిల్ విలన్‌గా, సునీల్, అనసూయ, రావు రమేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
