చిరంజీవి నెక్ట్స్ సినిమాకి సంబంధించి ఓ గుడ్ న్యూస్, మరో బ్యాడ్ న్యూస్ వైరల్ అవుతుంది. ఒక్కరి విషయంలో మెగా ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు.
మెగాస్టార్ చిరంజీవి గతేడాది వరకు బ్యాక్ టూ బ్యాక్ రెండు మూడు సినిమాలను లైన్‌లో పెట్టి అలరించారు. ఏడాదికి రెండు సినిమాలతో మెప్పించారు. కానీ అదే తేడా కొట్టింది. ఒక్కటి హిట్ అయితే రెండు తేడా కొట్టాయి. దీంతో రూట్ మార్చాడు చిరు. స్క్రిప్ట్ ల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం చిరంజీవి `విశ్వంభర` చిత్రంలో నటిస్తున్నారు. వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సోషియో ఫాంటసీగా తెరకెక్కుతుంది. ఇందులో చిరు ద్విపాత్రాభినయం చేస్తున్నారని సమాచారం. ఈ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదల కాబోతుంది.
దీంతోపాటు కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించిన రూమర్లు వినిపిస్తున్నాయి. మోహన్ రాజాతో ఓ సినిమా చేయబోతున్నారట. వీరి కాంబోలో `గాడ్ ఫాదర్` వచ్చిన విషయం తెలిసిందే. దీంతోపాటు `యానిమల్` ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలోనూ ఓ సినిమా ఉంటుందనే వార్తలు గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చిరు నెక్ట్స్ సినిమాకి సంబంధించిన మరో ఆసక్తికర విషయం చక్కర్లు కొడుతుంది.
మోహన్ రాజా దర్శకత్వంలో సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ శరవేగంగా జరుగుతుందట. ఆ పనులు చెన్నైలో జరుగుతున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ సినిమాకి స్టోరీని రైటర్, డైరెక్టర్ బీవీఎస్ రవి అందిస్తున్నారు. మోహన్ రాజా ఈ స్క్రిప్ట్ ని ఓ షేపౌట్ చేస్తున్నాడని, ప్రస్తుతం స్క్రిప్ట్ పై కూర్చొని వర్క్ చేస్తున్నారని సమాచారం. ఈ సినిమాని చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత తెరకెక్కించబోతుంది. ఆమె గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఈ సినిమాని నిర్మించనుంది.
అయితే ఈ మూవీ విషయంలో మెగా ఫ్యాన్స్ కలవరడానికి గురవుతున్నారు. రైటర్ విషయంలో వాళ్లు టెన్షన్ పడుతున్నారు. బీవీఎస్ రవి స్క్రిప్ట్ అందించిన సినిమాలు ప్రారంభంలో కొన్ని బాగానే ఆడాయి. కానీ ఆ తర్వాత చాలా ఫెయిల్యూర్సే ఉన్నాయి. ఇటీవల ఆయన కథలు పెద్దగా వర్కౌట్ కావడం లేదు. ఆయన స్టోరీ అందించిన `థ్యాంక్యూ` కూడా ఆడలేదు. దర్శకుడిగా ఆయన సక్సెస్ కాలేదు.
దీంతో ఆయన కథలపై ఆడియెన్స్ ఓ అభిప్రాయానికి వస్తున్నారు. అవి సక్సెస్ కావడం కష్టమనే ఫీలింగ్‌లోకి వచ్చారు. దీంతో చిరంజీవి ప్రాజెక్ట్ పై స్పందిస్తూ వామ్మో బీవీఎస్ రవి కథ అందిస్తున్నాడా? అయితే డిజాస్టర్ లోడింగ్ అని, ఈ సారి కూడా సినిమా పోయినట్టే అని, మోహన్‌రాజా నే కాపాడాలి అని కామెంట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. మొత్తంగా మెగాస్టార్ మరోసారి రిస్క్ చేస్తున్నాడని అంటున్నారు. పైగా చిరంజీవి గత సినిమా కూడా ఆడలేదు. ఈ టైమ్‌లో ఇలాంటి రిస్క్ అవసరమా అంటున్నారు అభిమానులు. ఈ ప్రాజెక్ట్ విషయంలోనే వాళ్లు టెన్షన్ పడుతున్నారు. మరి వారి అంచనాలను బ్రేక్ చేసి ఈ మూవీ సక్సెస్ అవుతుందా? మోహన్ రాజా ఆ మ్యాజిక్ చేస్తాడా? అనేది చూడాలి.
