చిరంజీవి కెరీర్లోనే దారుణ పరాజయం పాలైంది భోళా శంకర్. ఈ చిత్ర నాలుగవ రోజు వసూళ్లు చూస్తే అది ఎంత పెద్ద డిజాస్టర్ అనేది అర్థం అవుతుంది.  


గత ఏడాది విడుదలైన ఆచార్య ప్లాప్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. రూ. 120 కోట్లకు పైగా బడ్జెట్ తో ఆచార్య తెరకెక్కింది. రూ. 140 కోట్ల వరల్డ్ వైడ్ బిజినెస్ జరిగింది. డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ లైఫ్ టైం దాదాపు రూ. 49 కోట్ల షేర్ వరకు వసూలు చేసింది. అయితే ఈ మూవీ ఓపెనింగ్స్ తో పాటు ఫస్ట్ వీక్ వరకు ఓ మోస్తరు వసూళ్లు సాధించింది. ఆచార్య భారీ నష్టాలు మిగిల్చింది. ఆచార్యను మించిన బిగ్ డిజాస్టర్ గా భోళా శంకర్ రికార్డులకు ఎక్కింది. 

ఈ మధ్య కాలంలో చిరంజీవి చిత్రాలతో పోల్చితే భోళా శంకర్ దారుణమైన ఓపెనింగ్స్ అందుకుంది. రెండో రోజే 70 శాతం వసూళ్లు పడిపోయాయి. సెలవు దినాల్లో కూడా భోళా శంకర్ ని జనాలు చూడలేదు. అంటే ఆన్లైన్ బుకింగ్స్ కూడా లేవు. వీకెండ్ ముగిసే నాటికి భోళా శంకర్ షేర్ కేవలం రూ. 25 కోట్లు. ఇక సోమవారం తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి వచ్చిన వసూళ్లు చూస్తే విస్తుపోవాల్సిందే... ఏపీ/తెలంగాణల్లో భోళా శంకర్ సోమవారం రూ. 18 లక్షల షేర్ వసూలు చేసింది. 

నైజాంలో రూ. 6 లక్షలు. అంటే రెండు మూడు థియేటర్స్ వసూళ్లు రాష్ట్రవ్యాప్తంగా వచ్చాయన్న మాట. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు భోళా శంకర్ ఎంత పెద్ద డిజాస్టరో. టాలీవుడ్ లో దశాబ్ద కాలంలో ఇంత పెద్ద పరాజయం ఏ స్టార్ హీరోకి లేదని టాక్. భోళా శంకర్ నిర్మాత అనిల్ సుంకర భారీగా నష్టపోయారు. ఆయన స్వయంగా ఈ మూవీని విడుదల చేస్తున్నారు. చిత్ర బడ్జెట్ దాదాపు రూ. 120 కోట్లని సమాచారం. ఈ క్రమంలో ఆయన ఆస్తులు అమ్ముకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

దర్శకుడు మెహర్ రమేష్ వేదాళం రీమేక్ గా భోళా శంకర్ తెరకెక్కించారు. తమన్నా హీరోయిన్ గా నటించింది. కీర్తి సురేష్ కీలక రోల్ చేసింది. ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందించారు. ఆగస్టు 11న వరల్డ్ వైడ్ విడుదల చేశారు. భోళా శంకర్ ఇంత పెద్ద డిజాస్టర్ కాగా హిందీలో ఆగస్టు 25న విడుదల చేస్తారట. దీని మీద ట్రోల్స్ పేలుతున్నాయి.