Asianet News TeluguAsianet News Telugu

చిరంజీవి - బాలయ్యల మధ్య భారీ ఫైట్!

చిరంజీవి-బాలయ్యల మధ్య బాక్సాఫీస్ ఫైట్ తప్పేలా లేదు. మరోసారి సంక్రాంతి బరిలో పోటీ పడేలా ఉన్నారు. ఈ వార్త సోషల్ మీడియాను కుదిపేస్తోంది. 
 

chiranjeevi balakrishna might lock horns 2025 sankranthi with vishwambhara and nbk 109 ksr
Author
First Published Apr 9, 2024, 9:39 AM IST

చిరంజీవి, బాలయ్య టాలీవుడ్ టాప్స్ స్టార్స్. నాగార్జున, వెంకటేష్ చాలా వరకు మార్కెట్ కోల్పోయారు. చిరు, బాలయ్య మాత్రం బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్నారు. వందల కోట్ల వసూళ్లు రాబడుతున్నారు. ప్రస్తుతం బాలయ్య NBK 109 చేస్తున్నారు. ఇక చిరంజీవి విశ్వంభర టైటిల్ తో భారీ పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. NBK 109 చిత్రానికి బాబీ దర్శకుడు. బింబిసార ఫేమ్ వశిష్ట విశ్వంభర చిత్ర దర్శకుడు. NBK 109, విశ్వంభర చిత్రీకరణ దశలో ఉన్నాయి. 

ఈ రెండు చిత్రాలపై పరిశ్రమలో భారీ అంచనాలు ఉన్నాయి. కాగా 2025 సంక్రాంతికి NBK 109, విశ్వంభర విడుదలయ్యే సూచనలు కలవు. మేకర్స్ ఈ మేరకు ప్రణాళికలు వేస్తున్నారని సమాచారం. మరి ఇదే జరిగితే సంక్రాంతి ఫైట్ రసవత్తరంగా మారుతుంది. కాగా 2023 సంక్రాంతికి బాలకృష్ణ-చిరంజీవి వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య విడుదల చేశారు. 

రెండూ హిట్ టాక్ తెచ్చుకున్నాయి. అత్యధిక వసూళ్లతో వాల్తేరు వీరయ్య సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. ప్రచారం జరుగుతున్నట్లు NBK 109, విశ్వంభర 2025 సంక్రాంతికి విడుదలైతే ఎవరు విన్నర్ అవుతారో చూడాలి. గతంలో పలుమార్లు చిరంజీవి-బాలకృష్ణ సంక్రాంతి రేసులో పోటీపడ్డారు. మృగరాజు- నరసింహనాయుడు, అంజి - లక్ష్మీ నరసింహ, ఖైదీ 150-గౌతమి పుత్ర శాతకర్ణి సంక్రాంతికి విడులయ్యాయి. కొన్నిసార్లు చిరు విన్నర్ కాగా మరికొన్ని సార్లు బాలయ్య అయ్యాడు. 

విశ్వంభర చిత్రంలో చిరంజీవికి జంటగా త్రిష నటిస్తుంది. సురభి, ఇషా చావ్లా సైతం సపోర్టింగ్ రోల్స్ చేస్తున్నారు. కాగా ఇటీవల NBK 109 టీజర్ విడుదల కాగా ఆకట్టుకుంది. అంచనాలు పెంచేసింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios