Asianet News TeluguAsianet News Telugu

God Father: ఫ్యాన్స్ కి భరోసా ఇచ్చిన మెగాస్టార్‌.. ఎన్ని అంచనాలైనా పెట్టుకోండి దసరాకి రచ్చేనట..

`గాడ్‌ ఫాదర్‌` సినిమాపై మరింత భరోసా పెంచాడు మెగాస్టార్‌. అభిమానులకు హామీ ఇచ్చారు. ఈ దసరాకి రచ్చ మామూలుగా ఉండదని తెలిపారు. సినిమాపై ఎన్ని అంచనాలు పెంచారు.

chiranjeevi assured to fans regards god father dussehaa festival start
Author
First Published Sep 23, 2022, 9:06 PM IST

మెగాస్టార్‌ చిరంజీవి(Chiranjeevi) చివరగా `ఆచార్య`తో డిజప్పాయింట్‌ చేశారు. ఇప్పుడు రీమేక్‌ మూవీ `గాడ్‌ ఫాదర్‌`(God Father) చిత్రంలో నటిస్తున్నారు. మలయాళ సూపర్‌ హిట్‌ `లూసీఫర్‌` కి రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. మోహన్‌ రాజా దర్శకత్వం వహించారు. సల్మాన్‌ ఖాన్‌, నయనతార, సత్యదేవ్‌ వంటి భారీ కాస్టింగ్‌ నటిస్తుండటంతో సినిమాపై అంచనాలున్నాయి. పైగా మలయాళంలో సూపర్‌ హిట్‌ చిత్రం కావడంతో ఈ సినిమా ఎలా ఉంటుందనే టెన్షన్‌ కూడా ఉంది. 

ఇటీవల సినిమాకి సంబంధించి పలు భిన్నమైన కామెంట్లు వినిపించాయి. సినిమాపై బజ్‌ రావడం లేదని, ప్రమోషన్స్ లో వీక్‌ ఉందంటూ విమర్శలు వచ్చాయి. ఫలితంపై టీమ్‌ అసంతృప్తిగా ఉందనే టాక్ కూడా వినిపించాయి. వాయిదా పడబోతుందంటూ న్యూస్‌ వచ్చింది. వాటన్నింటికి ఫుల్‌ స్టాప్‌ పెడుతూ `గాడ్‌ ఫాదర్‌` చిత్రాన్ని అక్టోబర్‌ 5న దసరా కానుకగా విడుదల చేస్తున్నట్టు కన్ఫమ్‌ చేశారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన సెన్సార్‌ పూర్తయ్యింది. యూ/ఏ సర్టిఫికేట్‌ వచ్చింది. దీంతో అన్ని రూమర్స్ కి చెక్ పెట్టినట్టయ్యింది. 

ఇదిలా ఉంటే సినిమాపై మరింత భరోసా పెంచాడు మెగాస్టార్‌. అభిమానులకు హామీ ఇచ్చారు. ఈ దసరాకి రచ్చ మామూలుగా ఉండదని తెలిపారు. సినిమాపై ఎన్ని అంచనాలు పెట్టుకున్నా సరే అన్ని అంచనాలను ఈ చిత్రం రీచ్‌ అవుతుందని తెలిపారు. ఈ దసర `గాడ్‌ ఫాదర్‌` స్పెషల్‌గా నిలుస్తుందని వెల్లడించారు. తాజాగా రేడియో మిర్చి లో ఈ విషయాన్ని చిరంజీవి తెలిపారు.  దీంతో ఇప్పుడు `గాడ్‌ ఫాదర్‌`పై అంచనాలు మరింత పెరిగాయి. 

సినిమాలో సల్మాన్‌ ఖాన్‌ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. దీంతో హిందీలోనూ ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేస్తున్నారట. అది ఈ సినిమాకి ప్లస్‌ కాబోతుందని, చిరు బాలీవుడ్‌ మార్కెట్‌ పెంచుకునేందుకు ఇది దోహద పడుతుందని భావిస్తున్నారు. మరోవైపు సినిమా బిజినెస్‌ కూడా భారీగానే జరిగిందట. చిరు గత చిత్రం `ఆచార్య` దారుణమైన ఫలితాన్ని చవిచూసింది. బయ్యర్లకి భారీ నష్టాలు తెచ్చిపెట్టింది. ఇంకా దాన్నుంచి దర్శకుడు కొరటాల బయటపడలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ఆ ప్రభావం `గాడ్‌ ఫాదర్‌`పై పడుతుందని భావించారు. అందరి అంచనాలను రివర్స్ చేస్తూ ఏకంగా రూ.110కోట్లకి ఓటీటీ, శాటిలైట్‌ రైట్స్ అమ్ముడు పోయినట్టు ట్రేడ్‌ వర్గాల టాక్‌. 

దీంతో సినిమా సైతం అదే రేంజ్‌లో ఉంటుందని తాజాగా చిరు కూడా క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఈ దసరాకి రచ్చ మామూలుగా ఉండదంటూ రచ్చ చేస్తున్నారు. సినిమాకి సంబంధించి ప్రమోషన్‌ కార్యక్రమాలు కూడా పెంచారు. ఇప్పటికే `తార్‌ మార్‌ టక్కర్‌ మార్‌` అంటూ సాగే పాటని విడుదల చేయగా, మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలో భారీ స్థాయిలో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి కూడా ప్లాన్‌ చేస్తున్నట్టు సమాచారం. 
 

Follow Us:
Download App:
  • android
  • ios