Asianet News TeluguAsianet News Telugu

`విరాటపర్వం` చూస్తుంటే టి.కృష్ణగారు గుర్తొచ్చారుః చిరు ప్రశంస.. `ఆచార్య` స్టోరీ లీక్‌

మెగాస్టార్‌ చిరంజీవి `విరాటపర్వం` చిత్ర టీజర్‌ని అభినందించారు. చిత్ర యూనిట్‌ని అభినందించారు. ముఖ్యంగా ఇలాంటి కథని ఎంచుకున్న విధానం, దర్శకుడి పనితీరుని చిరు అప్రిషియేట్‌ చేశారు. అదే సమయంలో `ఆచార్య` కథేంటో లీక్‌ చేసేశాడు.

chiranjeevi appreciate rana sai pallavi starrer virataparvam teaser  arj
Author
Hyderabad, First Published Mar 19, 2021, 2:06 PM IST

మెగాస్టార్‌ చిరంజీవి `విరాటపర్వం` చిత్ర టీజర్‌ని అభినందించారు. ఆయన గురువారం ఈ టీజర్‌ని విడుదల చేసిన విషయం తెలిసిందే. చిత్ర యూనిట్‌ని అభినందించారు. ముఖ్యంగా ఇలాంటి కథని ఎంచుకున్న విధానం, దర్శకుడి పనితీరుని చిరు అప్రిషియేట్‌ చేశారు. అదే సమయంలో `ఆచార్య` కథేంటో లీక్‌ చేసేశాడు. రానా, సాయిపల్లవి జంటగా, ప్రియమణి, నందితా దాస్‌, నవీన్‌ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్న `విరాటపర్వం` చిత్రానికి వేణు ఉడుగుల దర్శకత్వం వహిస్తున్నారు. చెరుకూరి సుధాకర్‌ నిర్మిస్తున్నారు. సురేష్‌ ప్రొడక్షన్స్ సమర్పిస్తుంది.

ఈ టీజర్‌ విడుదల చేసిన సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ, ఇలాంటి కథని తెరకెక్కించేందుకు ముందుకు వచ్చినందుకు నిర్మాతలను అభినందించారు. ఆయన మాట్లాడుతూ, ``విరాటపర్వం` టీజర్‌ అద్భుతంగా ఉంది. ఇలాంటి కథని తీసుకున్న దర్శకుడు వేణు ఉడుగులని ప్రత్యేకంగా అభినందిస్తున్నా. సినిమా నక్సల్స్ బ్యాక్‌ డ్రాప్‌ అని తెలుస్తుంది. నాకు సంతోషకరమైన విషయం ఏంటంటే నెక్ట్స్ మా సినిమా `ఆచార్య` కూడా నక్సల్స్ బ్యాక్‌ డ్రాప్‌లోనే ఉంటుంది. మాది యూనిక్‌ ఫిల్మ్ ఈ మధ్య కాలంలో ఇలాంటి సినిమా రాలేదనే కొంచెం టెన్షన్‌ ఉండింది. కానీ ఈ సినిమా ఓ ట్రైలర్‌లా ఉంటుందనిపిస్తుంది. ఈ సినిమాని హిట్‌ చేస్తే నాకు హెల్ప్ అవుతుంది. చిత్ర బృందానికి అభినందనలు. 

ప్రత్యేకించి దర్శకుడు వేణు పనితనం చూస్తుంటే ఒకప్పుడు కమ్యూనిస్ట్ చిత్రాలకు పెట్టింది పేరు టి. కృష్ణగారు గుర్తొస్తున్నారు. నా ఫేవరేట్‌ డైరెక్టర్‌ ఆయన. అద్భుతమైన సినిమాలు చేశారు. అలాంటివి మళ్లీ కాంటెంపరరీ తీసుకొస్తున్నారు. మంచి పేరు తెచుకోవాలని కోరుకుంటున్నా. మహిళలకు మంచి ప్రాధాన్యతనిచ్చారు. సాయిపల్లవి, ప్రియమణి, నందితా దాస్‌ మంచి నటీనటులున్నారు. వారందరు సినిమా విజయానికి దోహదం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నా` అని అన్నారు. 

ఇదిలా ఉంటే చిరంజీవి తాను నటిస్తున్న `ఆచార్య` చిత్రం నక్సల్స్ బ్యాక్‌ డ్రాప్‌లో సాగుతుందనే వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. తాజాగా చిరు ఈ విషయాన్ని కన్ఫమ్‌ చేశారు. తమది కూడా నక్సల్స్ నేపథ్యంలో సాగే చిత్రమని వెల్లడించారు. ఈ సినిమా మే 13న విడుదల కానుంది. మరోవైపు `విరాటపర్వం` ఏప్పిల్‌ 30న రిలీజ్‌ కాబోతుంది.

Follow Us:
Download App:
  • android
  • ios