యూనివర్సల్‌ స్టార్‌ ప్రభాస్‌ బర్త్ డే సందడి కొనసాగుతుంది. సెలబ్రిటీలు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తాజాగా మెగాస్టార్‌ స్పందించారు. ప్రభాస్‌కి బర్త్ డే విశెష్‌ చెప్పి ఊహించని సర్ప్రైజ్‌ ఇచ్చారు. `మా ప్రియమైన ప్రభాస్‌కి పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఎగ్జైటింగ్‌ ప్రాజెక్ట్ లతో మీకు మంచి భవిష్యత్‌ ఉండాల`ని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రభాస్‌తో దిగిన ఫోటోని పంచుకున్నారు. 

మరోవైపు విక్టరీ వెంకటేష్‌ సైతం ట్విట్టర్‌ వేదికగా ప్రభాస్‌కి బర్త్ డే విశెష్‌ తెలిపారు. ప్రేమని, సంతోషాన్ని పంచారు. అలాగే సంపత్‌ నంది స్పందిస్తూ `బాక్సాఫీస్‌ తిరుగులేని విజేత అంటూ జిలియన్‌ హార్ట్ తో బర్త్ డే విశెష్‌ తెలిపారు. దర్శకుడు గుణశేఖర్‌, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ సైతం ప్రభాస్‌తో కలిసి ఉన్న ఫోటోలను పంచుకుంటూ విశెష్‌ తెలిపారు. 

ఇదిలా ఉంటే తన పుట్టిన రోజు కానుకగా ప్రభాస్‌ తన అభిమానులకు `రాధేశ్యామ్‌` టీజర్‌ని విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇది విశేషంగా ఆకట్టుకుంటోంది. మరోవైపు కొత్త లుక్‌ సైతం విశేషంగా మెప్పిస్తుంది.