100 శాతం నిజం అనుకుంటున్నా.. RRR ట్రైలర్ పై చిరంజీవి, సమంత, పూజ హెగ్డే రియాక్షన్
సినీ అభిమానులంతా ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ ట్రైలర్ ట్రాన్స్ లో ఉన్నారు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం నుంచి నేడు ట్రైలర్ విడుదలయింది. థియేటర్స్ లో, యూట్యూబ్ లో ట్రైలర్ ని రిలీజ్ చేశారు.
సినీ అభిమానులంతా ప్రస్తుతం RRR Trailer ట్రాన్స్ లో ఉన్నారు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం నుంచి నేడు ట్రైలర్ విడుదలయింది. థియేటర్స్ లో, యూట్యూబ్ లో ట్రైలర్ ని రిలీజ్ చేశారు. మూడు నిమిషాల నిడివి ఉన్న ట్రైలర్ ఆధ్యంతం గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉంది. రాజమౌళి సినిమా నుంచి ప్రేక్షకులు ఎంత ఆశిస్తారో అంత స్టఫ్ ట్రైలర్ నిండా ఉంది.
Ram Charan, NTR పాత్రలు.. గెటప్స్, యాక్షన్ సన్నివేశాలు, స్టంట్స్, విజువల్స్ అబ్బురపరిచే విధంగా ఉన్నాయి. ఎమోషనల్ కూడా కూడా కొన్ని సన్నివేశాలు హృదయానికి హద్దుకునేలా ఉన్నాయి. ట్రైలర్ కు సామాన్య ప్రేక్షకులు మాత్రమే కాదు.. సెలెబ్రిటీలు సైతం ఫిదా అవుతున్నారు. ఆర్ఆర్ఆర్ ట్రైలర్ ని చూస్తుంటే మరో ప్రపంచాన్ని చూస్తున్నట్లుగా ఉందని అభివర్ణిస్తున్నారు.
ఆర్ఆర్ఆర్ ట్రైలర్ పై మెగాస్టార్ Chiranjeevi, సమంత, పూజా హెగ్డే లాంటి సెలెబ్రిటీలు తమ స్పందన తెలియజేశారు. ట్రైలర్ అద్భుతంగా ఉందంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
'ఆర్ఆర్ఆర్ ట్రైలర్ బీభత్సంగా ఉంది. ఇక సినిమా ప్రభంజనం కోసం జనవరి 7 వరకు ఎదురుచూస్తూ ఉంటాను అని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు.
ట్రైలర్ పై సమంత స్పందిస్తూ.. మాటలు రావట్లేదు అని కామెంట్ పెట్టింది. ఎన్టీఆర్ పులితో పోరాడుతున్న దృశ్యాన్ని ఉద్దేశిస్తూ.. 100 శాతం ఇది నిజం అనుకుంటున్నట్లు తెలిపింది. తారక్ కళ్ళల్లో ఫైర్ ఉంది.. అతడు ఏమైనా చేయగలడు అని పేర్కొంది. ఇక రాంచరణ్ అల్లూరిగా మంటల్లో నుంచి చీల్చుకు వస్తున్న దృశ్యం ఉద్దేశించి కూడా సమంత కామెంట్ పెట్టింది. రాంచరణ్ లో ది బెస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఇది. పూర్తిగా క్యారెక్టర్ లో లీనమైపోయాడు అని సమంత పేర్కొంది.
'ఎలా వర్ణించాలో మాటలు రావట్లేదు. లేచి నిలబడి క్లాప్స్ మాత్రం కొడతాను' అని పూజా హెగ్డే ఆర్ఆర్ఆర్ ట్రైలర్ ని ఉద్దేశించి పేర్కొంది.
Also Read: కుంభస్థలాన్ని కొట్టడమే.. హోరెత్తిపోయిన RRR ట్రైలర్, బాక్సాఫీస్ కి చుక్కలే
ఆర్ఆర్ఆర్ చిత్రంలో రాంచరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీంగా నటిస్తున్న సంగతి తెలిసిందే. జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ట్రైలర్ విడుదలతో సినిమాపై అంచనాలు మరో లెవల్ కి చేరాయి.