ఈ సమ్మర్ కి సినీ ప్రేక్షకులని అలరించేందుకు టాలీవుడ్ ముస్తాబవుతోంది. సంక్రాంతికి ఆడియన్స్ రెండు భారీ చిత్రాలతో ఎంజాయ్ చేశారు. సమ్మర్ లో అంతకి మించి హంగామా ఉండబోతోంది.
ఈ సమ్మర్ కి సినీ ప్రేక్షకులని అలరించేందుకు టాలీవుడ్ ముస్తాబవుతోంది. సంక్రాంతికి ఆడియన్స్ రెండు భారీ చిత్రాలతో ఎంజాయ్ చేశారు. సమ్మర్ లో అంతకి మించి హంగామా ఉండబోతోంది. నాని దసరా, రావణాసుర, చిరంజీవి భోళా శంకర్, హను మాన్ లాంటి క్రేజీ చిత్రాలు సమ్మర్ కి రాబోతున్నాయి.
వరుస పరాజయాలు ఎదుర్కొంటున్న మెహర్ రమేష్ దర్శకతంలో చిరంజీవి భోళా శంకర్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో తమన్నా కథా నాయికగా నటిస్తుండగా.. కీర్తి సురేష్ చిరు చెల్లి పాత్రలో నటిస్తోంది. ఏప్రిల్ 14న ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు సన్నాహకాలు జరుగుతున్నాయి. వాల్తేరు వీరయ్య లాంటి రికార్డ్ బ్రేకింగ్ హిట్ తర్వాత చిరంజీవి నుంచి వస్తున్న చిత్రం కావడంతో భోళా శంకర్ ఎలా ఉంటుంది అనే ఉత్కంఠ మొదలయింది.
మెగాస్టార్ చిత్రం రిలీజ్ అవుతున్న రోజే అల్లరి నరేష్ కూడా తన తదుపరి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తుండడం ఇండస్ట్రీలో ఆసక్తిగా మారింది. అల్లరి నరేష్ నటిస్తున్న వైవిధ్య భరిత చిత్రం 'ఉగ్రం' కూడా ఏప్రిల్ 14నే రిలీజ్ కానుంది.
విజయ్ కనకమేడల దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. అయితే రానున్న రోజుల్లో అల్లరి నరేష్ తన చిత్ర రిలీజ్ డేట్ మార్చుకుంటాడా లేక అదే రోజున వస్తాడా అనేది చూడాలి. ఇంతలో మరో ఆసక్తికర అప్డేట్ వచ్చింది. సమంత నటిస్తున్న పౌరాణిక చిత్రం శాకుంతలం ఫిబ్రవరి 17న రిలీజ్ కావలసింది. కానీ ఈ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించారు. తాజాగా కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. శాకుంతలం చిత్రం కూడా ఏప్రిల్ 14నే రానున్నట్లు ప్రకటించారు. దీనితో పోటీ మరింత రసవత్తరంగా మారింది.
