Asianet News TeluguAsianet News Telugu

గమనించండి: 'వాల్తేరు వీరయ్య' ప్రీరిలీజ్ ఈవెంట్ వేదిక మారింది

మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజల కాంబినేషన్ లో రూపొందిన భారీ అంచనాలు వున్న మాస్ ఎంటర్ టైనర్ 'వాల్తేరు వీరయ్య' . 

 Chiranjeevi and Ravi Teja Waltair Veerayya: New venue and trailer launch date locked
Author
First Published Jan 6, 2023, 12:02 PM IST


బాలకృష్ణ తాజా చిత్రం 'వీరసింహారెడ్డి' ప్రీరిలీజ్ ఈవెంట్ ఈ సాయంత్రం ఒంగోలులో జరగుతోంది. మొదట ఈ ఈవెంట్ ఏబీఎం కాలేజ్ గ్రౌండ్స్ లో ప్లాన్ చేసారు. అయితే పోలీసుల నుంచి అనుమతుల విషయంలో ఇబ్బందులు తలెత్తడంతో వేదికను అర్జున్ ఇన్ఫ్రా గ్రౌండ్స్ కు మార్చారు. ఇప్పుడు చిరంజీవి చిత్రం 'వాల్తేరు వీరయ్య'పై కూడా ఇదే ప్రభావం పడింది. ఈ నెల 8న విశాఖ ఆర్కే బీచ్ లో ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ జరగాల్సి ఉంది. కొన్ని రోజులుగా ఈవెంట్ కు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. అయితే, వేదికను మార్చుకోవాలంటూ పోలీసు అధికారులు సూచించటంతో మార్పు జరిగింది.

వైజాగ్  ఆర్కే బీచ్ నుంచి ఆంధ్ర యూనివర్శిటీ ఇంజినీరింగ్ కాలేజ్ గ్రౌండ్ కు వేదికను నిర్వాహకులు మార్చారు.  . ఈ జనవరి 8న వీరయ్య గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అట్టహాసంగా జరగనుంది. ఈ భారీ ఈవెంట్ కి ముందు రోజు అయితే వాల్తేరు వీరయ్య సాలిడ్ ట్రైలర్ ని రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్స్ అనౌన్స్ చేసేసారు. దీనితో వాల్తేరు వీరయ్య కి అయితే కొత్త వేదిక కన్ఫర్మ్ అయ్యింది.  

జనవరి 13 వాల్తేరు వీరయ్య(waltair veerayya)తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఫస్ట్​లుక్ పోస్టర్, టీజర్‌తో సినిమా మీద అంచనాలు భారీగా పెరిగాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదల చేసిన రెండు పాటలతో ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా విడుదల చేసిన వాల్తేరు వీరయ్య టైటిల్ సాంగ్  సైతం అదరగొట్టాడు డీఎస్పీ.

మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజల కాంబినేషన్ లో రూపొందిన భారీ అంచనాలు వున్న మాస్ ఎంటర్ టైనర్ 'వాల్తేరు వీరయ్య' . ఈ సినిమాను 2023 సంక్రాంతికి చూడటానికి ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. దర్శకుడు బాబీ కొల్లి (కేఎస్ రవీంద్ర) ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ చిత్రాన్ని  భారీగా ప్రమోట్ చేస్తున్నారు నిర్మాతలు మైత్రీ మూవీస్ వారు.

ఇక ఇప్పటికే చిరంజీవికి సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ కి అద్భుతమైన స్పందన వచ్చింది. రవితేజ ప్రీ లుక్ పోస్టర్.. ఫస్ట్ లుక్, టీజర్ పై క్యూరియాసిటీని పెంచింది. పవర్ ఫుల్ పోలీస్-విక్రమ్ సాగర్ ఏసీపీగా రవితేజ పాత్రను పవర్ ప్యాక్డ్ గా పరిచయం చేస్తూ  ఫస్ట్ లుక్ , టీజర్ను విడుదల చేశారు మేకర్స్. బిల్డ్-అప్ షాట్ లు పర్ఫెక్ట్ ఎలివేషన్స్ ఇచ్చాయి.  ఈ నేపధ్యంలో ప్రీ రిలీజ్ మీట్ ని సైతం భారీగా చేయాలని ప్లాన్ చేస్తున్నారని మీడియా వర్గాల సమాచారం.
 
ఈ చిత్రంలో చిరంజీవి సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా, ప్రస్తుతం యూరప్ లో లీడ్ పెయిర్ పై  పాటల చిత్రీకరణ చేసారు. ఈ చిత్రానికి  రాక్ స్టార్  దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జికె మోహన్ సహ నిర్మాత. ఆర్థర్ ఎ విల్సన్ కెమెరామెన్ గా, నిరంజన్ దేవరమానె ఎడిటర్ గా, ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి సుష్మిత కొణిదెల కాస్ట్యూమ్ డిజైనర్. 

ఈ చిత్రానికి బాబీ కథ, మాటలు రాయగా, కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. రైటింగ్ డిపార్ట్మెంట్లో హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి కూడా పనిచేస్తున్నారు. సినిమా టాకీ పార్ట్ మొత్తం పూర్తయింది. చివరి పాటను ప్రస్తుతం యూరప్ లో చిరంజీవి, శృతి హాసన్ లపై చిత్రీకరిస్తున్నారు. 'వాల్తేరు వీరయ్య' జనవరి 13, 2023న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Follow Us:
Download App:
  • android
  • ios