కొన్ని సినిమా ప్రాజెక్టులు కేవలం వార్తల్లోనే ఉంటాయి. నిజ రూపం దాల్చవు. అలాంటిదే ‘విక్రమ్ వేద’ రీమేక్. ఆ మధ్యన తమిళంలో  ఘన విజయం సాధించిన సినిమా విక్రమ్ వేదా. విలక్షణ నటులు మాధవన్, విజయ్ సేతుపతి హీరోలుగా నటించిన ఈ సినిమా కోలీవుడ్ లో సంచలనం సృష్టించింది. ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు చాలా రోజులుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఇప్పటికీ ఏదీ ఫైనలైజ్ కాలేదు. కానీ ఈ సినిమా రీమేక్ విషయమై వార్తలు మాత్రం ఆగటం లేదు.

 ఇంతకు ముందు ఈ సినిమాలో ఒక పాత్రకు రానాను ఫైనల్ చేయగా మరో పాత్రలో వెంకటేష్, నాగార్జునల పేర్లు వినిపించాయి. ఆ తర్వాత ఆ రీమేక్ లో రానాతో పాటు రవితేజ నటించనున్నాడని అన్నారు. మాధవన్ పాత్రలో పోలీస్ ఆఫీసర్ గా రానా, విజయ్ సేతుపతి నటించిన క్రిమినల్ పాత్రలో రవితేజ నటించే అవకాశం ఉందని చెప్పుకున్నారు. తమిళ చిత్రానికి దర్శకత్వం వహించిన పుష్కర్, గాయత్రిలే తెలుగు వర్షన్ కు దర్శకత్వం వహించే అవకాశం ఉందని వినపడింది. అయితే అదీ ముందుకు వెళ్లలేదు. కానీ ఇప్పుడు పవన్, రానా కాంబినేషన్ లో `అయ్యప్పనుమ్ కోషియయమ్`రీమేక్ వర్క్ జరుగుతూండటంతో ఈ ప్రాజెక్టు మరోసారి తెరపైకి వచ్చింది. 

అయితే తాజాగా ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి మరో ఆసక్తికరమైన అప్ డేట్ ఫిలిం నగర్ లో వినిపిస్తోంది. ఈ క్రేజీ మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున ‘విక్రమ్ వేద’ తెలుగు రీమేక్‌లో కలిసి నటించబోతున్నారట.. చిరు, నాగ్ ఇద్దరు మంచి స్నేహితులు కాబట్టి కలిసి నటించొచ్చు అనే టాక్ వినిపిస్తోంది. ఓ పెద్ద నిర్మాత ఈ ప్రాజెక్టుని కదిపే ఆలోచనలో ఉన్నారు. అయితే ఈ చిత్రానికి డైరక్టర్ ఎవరు చేత చేయించాలి..ఎంత ప్రొడక్షన్ కు అవుతుంది. రీమేక్ రైట్స్ కు ఎంత తీసుకుంటారు వంటి విషయాలు లెక్కలు వేసి అప్పుడు పట్టాలు ఎక్కించాలనే డెసిషన్ కు వచ్చారట. ఇక  ఈ వార్త నిజమైతే తెలుగు ప్రేక్షకుల అభిరుచి కి తగ్గట్లు గా ఈ చిత్రం స్క్రిప్ట్ ను మార్పులు చేర్పులు చేయాలి. ఈ రీమేక్ కు ఎవరు డైరెక్టర్ గా వ్యవహరిస్తారు అనేది కూడా చూడాలి. చర్చలు జరుగుతున్న తీరును చూస్తుంటే ఇదే ఏడాది ఈ రీమేక్ సెన్స్ పైకి వెళ్లే అవకాశం కనిపిస్తుంది.