కోరమాండల్ ట్రైన్ దుర్ఘటనపై చిరు,ఎన్టీఆర్ దిగ్బ్రాంతి.. రక్తం అందించండి అంటూ ఫ్యాన్స్ కి మెగాస్టార్ రిక్వస్ట్
ఒడిశాలో జరిగిన కోరమాండల్ ఎక్స్ ప్రెస్, మరో రెండు రైళ్ల ఘోర ప్రమాదంతో దేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఈ దుర్ఘటనలో 230 మందికి పైగా ప్రయాణికులు మృత్యువాత పడ్డారు.

ఒడిశాలో జరిగిన కోరమాండల్ ఎక్స్ ప్రెస్, మరో రెండు రైళ్ల ఘోర ప్రమాదంతో దేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఈ దుర్ఘటనలో 230 మందికి పైగా ప్రయాణికులు మృత్యువాత పడ్డారు. వందలాది మంది గాయాలతో చికిత్స పొందుతున్నారు. బాలేశ్వర్ సమీపంలో బాహానగర్ బజార్ రైల్వేస్టేషన్ వద్ద ఈ పెను ప్రమాదం జరిగింది.
230 మందికి పైగా ప్రాణాలు కోల్పొవడంతో దేశం మొత్తం విషాదం నెలకొంది. సెలెబ్రిటీలు ఒక్కొక్కరుగా ఈ సంఘటనపై స్పందిస్తున్నారు. చిరంజీవి ట్వీట్ చేస్తూ ' ఇది ఊహకి అందని విషాదం, కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ప్రమాదానికి గురి కావడం తో షాక్ అయ్యాను. తమ వారిని కోల్పోయిన కుటుంబ సభ్యులకు నా సానుభూతి. గాయపడ్డ వారికి తప్పనిసరిగా రక్తం అవసరం ఉంటుంది. పెద్ద మొత్తంలో రక్తం అవసరం అవుతుంది. కాబట్టి సమీపంలో ఉన్న నా అభిమానులు మీకు చేతనైనంత వరకు రక్త దానం చేయండి. ప్రాణాలు నిలబెట్టేందుకు మీరు చేయగలిగింది చేయండి అని చిరంజీవి కోరారు.
ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ ట్వీట్ చేస్తూ.. రైలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికీ నా సంతాపం. వారి కుటుంబాలకు నా సానుభూతి తెలియజేస్తున్నా. ఈ కష్టకాలంలో వారికీ మనోధైర్యం చేకూరాలని ప్రార్థిస్తున్నా అని పేర్కొన్నారు.
హీరో నిఖిల్ ట్విట్టర్ లో ఇండియన్ రైల్వేస్ పై మండిపడ్డారు. కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ఘటనలో ఎఫెక్ట్ అయిన కుటుంబాల కోసం నా హృదయం తపిస్తోంది. రైళ్లు అంటే భద్రత ఉండాలి.. మృత్యువుకి కారణం కాకూడదు. ఇలాంటి సంఘటనలు ఇంకెప్పుడూ జరగకూడదు. ఇండియన్ రైల్వేస్ దీనికి బాధ్యత వహించి తీరాలి అని నిఖిల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.