చిరు డ్యూయిల్ రోల్ హ్యాపీ..ఆ పాయింట్ దగ్గరే ఫ్యాన్స్ కు టెన్షన్

చిరు రీలాంచ్ చిత్రం ‘ఖైదీ నంబర్ 150’లో మరోసారి రెండు పాత్రల్లో మెప్పించారు చిరంజీవి. ఇప్పుడు అదే స్కీమ్ ని మరోసారి అప్లై చేయబోతున్నారు.చిరు మ‌రోసారి ద్విపాత్రాభిన‌యం చేయ‌బోతున్నాడు. 

Chiranjeevi all set to play dual role again? jsp


తన జనరేషన్ లో ఎక్కువ డ్యూయిల్ రోల్స్ చేసిన హీరో ఎవరూ అంటే మెగాస్టార్ అని చెప్పాలి. అప్పట్లో అదో ట్రెండ్. అలా డ్యూయ‌ల్ రోల్స్ చేసిన  సినిమాల‌న్నీ హిట్స్.  దొంగమొగుడు, రోషగాడు, సింహపురి సింహం, జ్వాల, రక్త సింధూరం, యముడికి మొగుడు, రౌడీ అల్లుడు, రిక్షావోడు, స్నేహం కోసం..ఇలా వరసపెట్టి చెప్తే పెద్ద లిస్ట్ ఉంటుంది. అంతెందుకు చిరు రీలాంచ్ చిత్రం ‘ఖైదీ నంబర్ 150’లో మరోసారి రెండు పాత్రల్లో మెప్పించారు చిరంజీవి. ఇప్పుడు అదే స్కీమ్ ని మరోసారి అప్లై చేయబోతున్నారు.చిరు మ‌రోసారి ద్విపాత్రాభిన‌యం చేయ‌బోతున్నాడు. 

చిరంజీవి హీరోగా బాబి ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకోనుంది. ఇందులో చిరు రెండు పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నాడు. ఈ మధ్యనే బాబి -చిరు మ‌ధ్య భేటీ జ‌రిగింది. చిరుకి ఫుల్ స్క్రిప్టు ని వినిపించాడు బాబి. కొన్ని మార్పులు, చేర్పుల‌తో చిరు ఈ క‌థ‌ని ఓకే చేసినట్లు సమాచారం.ఈ సినిమా కోసం ఇంట్రస్టింగ్ బ్యాక్‌డ్రాప్‌ను సెల‌క్ట్ చేసుకుని క‌థ త‌యారు చేసుకున్నాడ‌ట‌. ఓ స్టార్ హీరోకి, అత‌ని అభిమానికి మ‌ధ్య న‌డిచే కాన్సెప్ట్‌తో సినిమా ఉంటుంద‌ని టాక్‌.ఇందులో స్టార్ హీరోగా చిరంజీవి న‌టిస్తుంటే.. ఆయ‌న అభిమానిగా ఎవ‌రు న‌టిస్తార‌నేది ఇంకా ఖరారు కాలేద‌ట‌.  బాలీవుడ్‌లో ఫ్యాన్ త‌ర‌మా చిత్ర‌మా, లేక మ‌ల‌యాళంలో డ్రైవింగ్ లైసెన్స్ త‌ర‌హా చిత్ర‌మా అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.  

మరో ప్రక్క అదేం కాదు..తండ్రి,కొడుకులుగా చిరంజీవి ద్విపాత్రాభినయం చేస్తున్నాడంటున్నారు. అయితే చిరంజీవి తండ్రి కొడుకులుగా చేసిన సినిమాల విషయానికొస్తే.. తొలిసారి ‘బిర్లా రంగా’, ‘బందిపోటు సింహం’ ‘‘రిక్షావోడు’, ‘స్నేహం కోసం’, ‘అందరివాడు’ సినిమాల్లో తండ్రీ తనయులుగా ద్విపాత్రాభినయం చేసారు. ఈ సినిమాల్లో ఏది చిరంజీవి సక్సెస్ అందించలేకపోయాయి. అయితే బాబి మంచి స్క్రిప్టు నాలెడ్జ్ ఉన్నవాడు. చిరంజీవి కి మంచి ఎనాలసిస్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా మంచి ప్రాజెక్టే బయిటకు వస్తుంది. 

 రీఎంట్రీ మూవీ “ఖైదీ నెం.150” తరువాత ఆయన డ్యూయల్ రోల్ పాత్రను పోషించడం రెండవసారి అవుతుంది. రజనీకాంత్ నటించిన యాక్షన్ డ్రామా “పేటా”తో సౌత్ అరంగేట్రం చేసిన బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ ఇందులో విలన్ పాత్ర పోషించే అవకాశం ఉంది. దీనిని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.
 
ఇక  ప్ర‌స్తుతం `ఆచార్య‌` షూటింగ్ జ‌రుగుతోంది. ఆ త‌ర‌వాత `లూసీఫ‌ర్` రీమేక్ ప‌ట్టాలెక్కుతుంది. అది పూర్త‌యిన త‌ర‌వాతే… బాబి సినిమా ఉండ‌బోతోంది. మ‌రోవైపు మెహ‌ర్ ర‌మేష్ తో ఓ సినిమా చేయాలి చిరు. బాబి సినిమానీ, మెహ‌ర్ ర‌మేష్‌సినిమానీ ఒకేసారి ప‌ట్టాలెక్కించాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్టు టాక్‌.  మైత్రీ మూవీ మేకర్స్ బ్యాన‌ర్‌పై ఈ  సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios