Acharya:‘ఆచార్య’ డిస్ట్రిబ్యూటర్స్ సెటిల్మెంట్...ఎన్ని కోట్లు అంటే

క‌నీసం రెంట్లు కూడా తెచ్చుకోలేని ప‌రిస్థితి చాలా చోట్ల కనిపించింది. మంగ‌ళ‌వారం రంజాన్ పండుగ క‌లిసొస్తుంద‌ని అంతా అనుకున్నారు. కానీ... అదీ ఏమీ కనపడలేదు. 

Chiranjeevi Acharya Settlement: Around 30 Crores?


టాలీవుడ్  స్టార్ హీరోలు  మెగాస్టార్ చిరంజీవి, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టించిన తాజా చిత్రం ‘ఆచార్య’. స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ తెర‌కెక్కించిన ఈ చిత్రం ఏప్రిల్ 29న రిలీజ్ అయ్యింది. క్రేజీ కాంబినేష‌న్‌లో రూపొందిన ఈ చిత్రంపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. అయితే ‘ఆచార్య’ రిలీజ్ త‌ర్వాత ఇటు ఫ్యాన్స్‌ని, అటు ప్రేక్ష‌కుల‌కు సినిమా మెప్పించ‌లేక‌పోయింది. ఎన్నో ఎక్సపెక్టేషన్స్  పెట్టుకున్న సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద తొలి ఆట నుంచే ఆశించిన టాక్‌ను రాబ‌ట్టుకోలేక‌పోయింది. తొలి రోజున వ‌చ్చిన క‌లెక్ష‌న్స్‌కు, ఆరో రోజు క‌లెక్ష‌న్స్‌కు సంబంధ‌మే క‌నిపించ‌టం లేదు.  దాంతో 2022లోనే అతి పెద్ద ఫ్లాప్ గా మిగిలింది ఆచార్య‌. 

తొలి మూడు రోజుల్లో దాదాపు 40 కోట్లు తెచ్చుకుంది. సోమ‌వారం నుంచి వ‌సూళ్లు మ‌రింత దారుణంగా ప‌డిపోయాయి. క‌నీసం రెంట్లు కూడా తెచ్చుకోలేని ప‌రిస్థితి చాలా చోట్ల కనిపించింది. మంగ‌ళ‌వారం రంజాన్ పండుగ క‌లిసొస్తుంద‌ని అంతా అనుకున్నారు. కానీ... అదీ ఏమీ కనపడలేదు. ఇప్పుడు ఈ సినిమా న‌ష్ట‌మెంతో లెక్కేసుకోవటం కన్నా ఎంత సెటిల్మెంట్ చేయాలనేదే టాపిక్ వస్తోంది. 

 ఈ సినిమాని భారీ రేట్లకు కొని, న‌ష్ట‌పోయిన‌వాళ్ల‌ని ఆదుకోవాల్సిన అవ‌స‌రం వ‌చ్చాయి. ఇప్ప‌టికే చాలామంది డిస్టిబ్యూట‌ర్లు.. చిరుకి ట‌చ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది.  చిరు కూడా సానుకూలంగా స్పందించిన‌ట్టు స‌మాచారం. ఈ నేపధ్యంలో ఈ సినిమాకు 30 కోట్లు దాకా సెటిల్మెంట్ చేద్దామని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

 ఈ సినిమా రామ్ చ‌ర‌ణ్ నిర్మించిన సంగ‌తి తెలిసిందే. అయితే సింహ భాగం వాటా మాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ సంస్థ పెట్టింది. చిరు, చ‌ర‌ణ్‌లు త‌మ రెమ్యునేషన్స్  సైతం తీసుకున్నారు. ఈ నేప‌థ్యంలో ఆ రెమ్యునేషన్స్ లో  కొంత వాటా తిరిగి ఇవ్వాల‌ని నిర్ణయించుకున్న‌ట్టు స‌మాచారం. ఒక్కో బ‌య్య‌ర్ దాదాపు 70 శాతం న‌ష్ట‌పోతున్న‌ట్టు లెక్క‌లు చెబుతున్నాయి. అంతా ఇవ్వ‌క‌పోయినా.. క‌నీసం 25 శాతం తిరిగి ఇవ్వాల‌ని చిరు భావిస్తున్నారని వినికిడి. దాంతో బ‌య్య‌ర్లు కాస్తో కూస్తో ఊపిరి పీల్చుకొనే అవ‌కాశం ఉంది.

కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ, మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యానర్స్‌పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో పూజాహెగ్డే హీరోయిన్‌గా నటించగా, తనికెళ్ల భరణి, సోనూ సూద్ తదితరులు కీలకపాత్రల్లో నటించారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios