సంక్రాంతికి రావాల్సిన `ఆర్‌ఆర్‌ఆర్‌`, `రాధేశ్యామ్‌` వాయిదా పడుతూ వచ్చాయి. ఇప్పుడు మరో సినిమా వాయిదా  పడింది. మెగాస్టార్‌ సినిమా సైతం వెనక్కి తగ్గింది. చిరంజీవి, రామ్‌చరణ్‌ కలిసి నటించిన `ఆచార్య` చిత్రం వాయిదా పడింది.

 కరోనా మహమ్మారి దెబ్బకి పెద్ద సినిమాలన్నీ వెనక్కి వెళ్తున్నాయి. సంక్రాంతికి రావాల్సిన `ఆర్‌ఆర్‌ఆర్‌`, `రాధేశ్యామ్‌` వాయిదా పడుతూ వచ్చాయి. ఇప్పుడు మరో సినిమా వాయిదా పడింది. మెగాస్టార్‌ సినిమా సైతం వెనక్కి తగ్గింది. చిరంజీవి(Chiranjeevi), రామ్‌చరణ్‌(Ram Charan) కలిసి నటించిన `ఆచార్య`(Acharya) చిత్రం వాయిదా పడింది. ఫిబ్రవరి 4న విడుదల కావాల్సిన ఈ సినిమాని వాయిదా వేస్తున్నట్టు తాజాగా చిత్ర యూనిట్‌ వెల్లడించింది. కరోనా మహమ్మారి కారణంగా వాయిదా వేస్తున్నామని, కొత్త డేట్‌ త్వరలో అనౌన్స్ చేస్తామని వెల్లడించారు. 

Scroll to load tweet…

`కోవిడ్‌ విజృంభన కారణంగా ప్రస్తుతం నెలకొన్ని పరిస్థితుల దృష్ట్యా `ఆచార్య` విడుదలని వాయిదా వేస్తున్నాం. కొత్త విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తాం. అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండండి, కరోనా నియమాలను పాటించండి` అని పేర్కొంది యూనిట్‌. దీంతో Chiranjeevi అభిమానులు తీవ్ర నిరాశలోకి వెళ్లిపోయారు. ఇప్పటికే సంక్రాంతికి రావాల్సిన రామ్‌చరణ్‌ `ఆర్‌ఆర్‌ఆర్‌` వాయిదా వల్ల రాలేకపోయాడు, ఇక ఫిబ్రవరిలోనైనా మెగా హీరోలను చూడాలనుకున్న అభిమానులకు ఆ ఛాన్స్ కూడా లేకుండా పోయింది. కరోనా మహమ్మారి సినిమాలకు పెద్ద శాపంగా మారిపోయింది. 

మున్ముందు రాబోతున్న పెద్ద సినిమాలు కూడా వీటిబాటలోనే సాగనున్నట్టు తెలుస్తుంది. ఫిబ్రవరిలోనే `ఖిలాడీ`, `భీమ్లా నాయక్‌` చిత్రాలు విడుదల కావాల్సి ఉంది. వారి విడుదల విషయంలోనూ అనుమానాలు నెలకొన్నాయి. కరోనా రోజు రోజుకి మరింతగా విస్తరిస్తుంది. దేశంలో కేసులు రోజుకి మూడు లక్షల వరకు నమోదవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో సినిమాలు విడుదల కష్టంగా మారిపోయింది. దీంతో వాయిదా పడుతున్నాయి. 

ఇక చిరంజీవి, రామ్‌చరణ్‌ ఫస్ట్ వెండితెరపై కలిసి నటిస్తున్న మల్టీస్టారర్‌ చిత్రం `ఆచార్య`. కొరటాల శివ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుంది. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రామ్‌చరణ్‌, నిరంజన్‌రెడ్డి నిర్మాతలు. ఇందులో చిరు సరసన కాజల్‌, చరణ్‌కి జోడీగా పూజా హెగ్డే కథానాయికలుగా నటిస్తున్నారు.