చిరంజీవి 'ఆచార్య' టైటిల్ అందుకే పెట్టారా?!

చిరంజీవి సినిమాకి `ఆచార్య` టైటిల్ ఎందుకు పెట్టారు? అసలు ఈ చిత్ర కథేంటి అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. 

Chiranjeevi Acharya movie story line jsp

చిరంజీవి హీరోగా కొరటాల దర్శకత్వంలో 'ఆచార్య' సినిమా రూపొందుతోంది. కాజల్  హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో, చరణ్ - పూజ హెగ్డే ప్రత్యేకమైన పాత్రల్లో అలరించనున్నారు. భారీ బడ్జెట్ తో తండ్రి,కొడుకులు చేస్తున్న ఈ సినిమాపై మంచి ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి. ఈ నేపధ్యంలో ఈ చిత్రం స్టోరీ లైన్ ఏమిటి..ఆచార్య టైటిల్ ఎందుకు పెట్టారు అనేది చర్చనీయాంశంగా మారింది. 

ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా స్టోరీ లైన్ ఇలా ఉంది.  అవినీతిపరులను ఉపదేశాలతో మార్చలేమని భావించి, ఉద్యమ మార్గాన్ని ఎంచుకునే ఓ ఆచార్యుడి కథ ఇది అంటున్నారు. కథా గమనం అంతా దేవాలయ భూములు ఆక్రమణ చుట్టూ తిరుగుతుందని తెలుస్తోంది. అందుకే ఈ సినిమా కోసం 20 కోట్ల రూపాయల ఖర్చుతో 20 ఎకరాల్లో ఒక భారీ సెట్ వేశారు.

'ధర్మస్థలి' పేరుతో ఒక గుడి .. దాని పరిసరాలకు సంబంధించిన సెట్ ఇది అని తెలుస్తోంది. జనతా గ్యారేజ్ సినిమాలో గ్యారేజ్ లో ఎలా అయితే కథ మొత్తం తిరిగిందో ఇక్కడా అలాగే జరుగుతుందని అంటున్నారు. ఇక ఈ సెట్ ... ఇది ఒక ఫైట్ కోసమో .. పాట కోసమో  వేసిన సెట్ కాదట. సినిమాకి సంబంధించిన 60 శాతం షూటింగు ఈ సెట్ పరిధిలోనే జరుగుతుందని అంటున్నారు. సినిమాకి సంబంధించిన కీలకమైన సన్నివేశాల ఆవిష్కారం ఈ సెట్ లోనే జరుగుతుందని వినికిడి.

ముఖ్యంగా ఈ సెట్ లో చిరంజీవి - చరణ్  కాంబినేషన్లో వచ్చే సన్నివేశాలు కూడా ఉంటాయని తెలుస్తోంది. ఈ సినిమాకి ఈ సెట్ ప్రత్యేకమైన ఆకర్షణ అని అంటున్నారు. షూటింగ్ పరంగా ఈ సినిమా ముగింపుదశకి చేరుకుంది. ప్రస్తుతం కరోనా కారణంగా షూటింగును వాయిదా వేశారు.  

ఇందులో విలన్ పాత్రలో రియల్ హీరో సోనూసూద్ నటిస్తుండగా.. మరో విలన్ గా బెంగాళీ నటుడు జిష్షు సేన్ గుప్తా నటిస్తున్నట్లుగా సమాచారం. ఈ సినిమా మే 13న థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios