ఖైదీ నెంబర్ 150 ఐదు వారాల షేర్స్

chiranjeevi 150 collections final
Highlights

  • బాహుబలి తర్వాత రికార్డు కలెక్షన్లు సాధించిన ఖైదీ నెంబర్ 150
  • మెగాస్టార్ స్టామినాని బాక్సాఫీస్ మద్ద మరోసారి చాటిన రీ ఎంట్రీ మూవీ
  • శ్రీమంతుడు రికార్డ్ బ్రేక్ చేసి కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసిన మెగాస్టార్

 

మెగాస్టార్ చిరంజీవి కి గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన మూవీ ఖైదీ నెంబర్ 150. వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమా బిజినెస్ ఈ వీక్ తో దాదాపు క్లోజ్ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. థియేటర్ల నుంచి కావాల్సిన బిజినెస్ దాదాపు క్లోజ్ అవుతున్నా ఇంకా షేర్‌ ఫ్రీ ఇవ్వలేదు. అయితే వారంలోని మిగతా రోజుల్లో వచ్చే డెఫిసిట్స్‌కి, వీకెండ్స్‌లో వచ్చే షేర్స్‌తో కలిపిచూస్తే.. ఇక అదనంగా వచ్చే షేర్‌ ఏమీ వుండదు. ముప్పయ్‌ మూడు రోజుల పాటు షేర్లు రాబట్టిన ఈ చిత్రం వంద కోట్ల షేర్‌ని దాటి చిరంజీవికి తిరుగులేని రీఎంట్రీని ఇచ్చింది.

తెలుగు చలన చిత్ర చరిత్రలో బాహుబలి తర్వాత అతి పెద్ద విజయంగా రికార్డుకెక్కిన ఖైదీ నెంబర్ 150 బాక్సాఫీస్‌పై చిరంజీవి ఆధిపత్యాన్ని నిరూపించింది. ఇంతవరకు 102.57 కోట్ల షేర్స్‌ రాబట్టిన ఈ చిత్రానికి ఇంకా కొన్ని ఏరియాస్‌లో ఓవర్‌ ఫ్లోస్‌ కలపలేదు. అవి కూడా కలిపితే ఖైదీ ఫుల్‌ రన్‌ వసూళ్లు 105 కోట్ల మార్కుని దాటతాయని ట్రేడ్‌ రిపోర్ట్‌. బాహుబలి తర్వాత 'నాన్‌-బాహుబలి' అంటూ శ్రీమంతుడు రికార్డులని టార్గెట్‌ చేస్తోన్న తెలుగు హీరోలకి ఇప్పుడు శ్రీమంతుడు రికార్డ్స్ దాటిన చిరంజీవి కొత్త బెంచ్‌మార్క్‌ సెట్‌ చేసి పెట్టారు. ఇక ఖైదీ నం. 150 33రోజుల వసూళ్ల వివరాలు ఇలా ఉన్నాయి..

నైజాం:        19.68 కోట్లు

సీడెడ్‌:        15.25 కోట్లు

ఉత్తరాంధ్ర:    12.85 కోట్లు

ఈస్ట్‌:         8.35 కోట్లు

వెస్ట్‌:         6.02 కోట్లు

గుంటూరు:     7.40 కోట్లు

కృష్ణ:         5.70 కోట్లు

నెల్లూరు:         3.42 కోట్లు

కర్నాటక:         9 కోట్లు

యుఎస్‌:         10 కోట్లు

రెస్టాఫ్‌ ఇండియా:     1.9 కోట్లు

రెస్టాఫ్‌ ది వరల్డ్‌:     3 కోట్లు

షేర్‌ మొత్తం:    102.57 కోట్లు

loader