మెగాస్టార్ చిరంజీవి జోరు మాములుగా లేదు. కుర్ర హీరోలకు మించి ఆయన వరుస చిత్రాలు ప్రకటిస్తున్నారు, ఆర్ ఆర్ ఆర్ చేస్తున్న రామ్ చరణ్ తన నెక్స్ట్ మూవీకి ఇంకా సైన్ చేయలేదు. చిరంజీవి మాత్రం ఆచార్యతో పాటు మరో మూడు చిత్రాలు కన్ఫర్మ్ చేశారు. సోషల్ మీడియా వేదికగా చిరంజీవి తనతో చిత్రాలు చేస్తున్న, చేయబోతున్న దర్శకులను పరిచయం చేశారు. ఆ నలుగురు దర్శకులను చిరంజీవి ఫెంటాస్టిక్ ఫోర్ అంటూ గ్రేట్ క్యాప్షన్ ఇచ్చారు. 


ప్రస్తుతం చిరంజీవి కొరటాల శివతో ఆచార్య మూవీ చేస్తున్నారు. హైదరాబాద్ లో వేసిన ప్రత్యేకమైన సెట్స్ లో ఆచార్య షూటింగ్ జరుగుతుంది. చరణ్ కీలక రోల్ చేస్తున్న నేపథ్యంలో ఆయన కూడా సెట్స్ లో జాయిన్ అయ్యారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీలో  కాజల్  అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. సమ్మర్ కానుకగా ఆచార్య విడుదలయ్యే అవకాశం కలదు. అలాగే లూసిఫర్ రీమేక్ కి చిరు సిద్ధం అవుతున్నారు. మలయాళ హిట్ మూవీకి రీమేక్ గా వస్తున్న లూసిఫర్ రీమేక్ బాధ్యతలు తమిళ దర్శకుడు మోహన్ రాజాకు  అప్పగించారు. త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. 

ఈ రెండు చిత్రాలతో పాటు మెహర్ రమేష్ తో ఒక చిత్రం,  డైరెక్టర్ బాబీతో మరొక చిత్రం ఆయన కమిటయ్యారు. మెహర్ రమేష్ తో చిరు చేస్తున్నది కూడా రీమేక్ అన్న మాట వినిపిస్తుంది. అజిత్ హిట్ మూవీ వేదాళం తెలుగులో వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కనుందని ప్రచారం జరిగింది. అయితే దీనిపై అధికారిక ప్రకటన లేదు. ఇక బాబీ చిరుతో ఓ స్ట్రెయిట్ మూవీ చేస్తున్నారట. మొత్తంగా తన నలుగురు దర్శకులతో చిరు మెగా ఫోజిచ్చారు.