పరిశ్రమలో చిరంజీవి, నాగార్జున మంచి మిత్రులు. మిగవారితో పోల్చితే చిరంజీవి నాగార్జునతో చాలా సన్నిహితంగా ఉంటారు. అలాంటి నాగార్జున కోసం చిరంజీవి ఏకంగా ఫుడ్ ప్రిపేర్ చేశారట. ఈ విషయాన్ని నాగార్జున స్వయంగా ట్విట్టర్ లో పోస్ట్ చేయడంతో పాటు, ఆసక్తికర ఫోటో పంచుకున్నారు. నాగార్జున నటించిన వైల్డ్ డాగ్ మూవీ నేడు విడుదల అవుతుంది. సినిమా విడుదల నేపథ్యంలో టెన్షన్ పడుతున్న నాగార్జున కోసం చిరంజీవి స్వయంగా వంట చేశారట. 


చిరు వంట చేయడం ద్వారా తనను టెన్షన్ ప్రీ చేశాడని నాగార్జున ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. మరో విశేషం ఏమిటంటే ఆ ఫోటో.. చిరు సతీమణి సురేఖ తీశారట. వైల్డ్ డాగ్ మూవీ ప్రేక్షకులలోకి తీసుకెళ్లడానికి నాగార్జున విరివిగా ప్రమోషన్స్  చేయడం జరిగింది. దానిలో భాగంగానే చిరంజీవిని కలిసి పరోక్షంగా మూవీకి హైప్ తెచ్చే ప్రయత్నం చేశారు. 


ఇక వైల్డ్ డాగ్ చిత్రాన్ని యాక్షన్ ఎంటర్టైనర్ గా దర్శకుడు అహిషోర్ సాల్మన్ తెరకెక్కించారు. నాగార్జున వైల్డ్ డాగ్ మూవీలో ఎన్ ఐ ఏ ఏజెంట్ రోల్ చేస్తున్నారు. వైల్డ్ డాగ్ ట్రైలర్ ఆకట్టుకున్న నేపథ్యంలో మూవీపై పాజిటివ్ బజ్ ఏర్పడింది. ఇక వైల్డ్ డాగ్ చిత్రానికి థమన్ బీజీఎమ్ అందించారు.