ప్రభాస్ తనలోని రాముడిని పైకి తెస్తున్నారు.. ఆదిపురుష్ ప్రీ రిలీజ్ వేడుకలో చినజీయర్ స్వామి కామెంట్స్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన పౌరాణిక చిత్రం ఆదిపురుష్ జూన్ 16న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. దీనితో ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో ఆదిపురుష్ టీం కనీవినీ ఎరుగని విధంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన పౌరాణిక చిత్రం ఆదిపురుష్ జూన్ 16న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. దీనితో ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో ఆదిపురుష్ టీం కనీవినీ ఎరుగని విధంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ప్రీరిలీజ్ వేడుకకు ప్రభాస్, కృతిసనన్, ఓం రౌత్ సహా ఆదిపురుష్ టీం మొత్తం హాజరైంది. ఇక ఈ వేడుకకి చినజీయర్ స్వామి ముఖ్య అతిథిగా హాజరై చిత్ర యూనిట్ కి తన ఆశీస్సులు అందించారు.
ఈ తరానికి రామాయణ కథని అందించే ప్రయత్నం చేస్తున్న ప్రభాస్, డైరెక్టర్ ఓం రౌత్ ని ప్రశంసించారు. శ్రీరాముడిని కీర్తిస్తూ శ్లోకంతో చినజీయర్ స్వామి తన ప్రసంగం ప్రారంభించారు. శ్రీరాముడు ఈ నేలపై నడయాడిన మహోన్నత రూపం అని అన్నారు. బాహుబలి అయిన ప్రభాస్.. నిజమైన బాహుబలి శ్రీరాముడు అని లోకానికి నిరూపించడానికి వస్తున్నాడు.
శ్రీరాముడు మానవజాతికి ఆదర్శ పురుషుడు. రాముడిని మనుషులు ప్రేమించారు. పశువులు, పక్షులు ప్రేమించాయి. ఋషులు, రాక్షసులు కూడా ప్రేమించారు. ముక్కు చెవులు కోసిన శూర్పణఖ కూడా ప్రేమించింది. రాముడు అడవులకు వెళ్ళినప్పుడు ఆయన్ని అడవుల్లో వదిలిన రథం గుర్రాలు వెనక్కి వెళ్ళడానికి ఇష్టపడలేదు. బలవంతంగా తీసుకెళ్లారు.
అలాంటి రాముడి చరిత్రని ఈ తరానికి అందించబోతున్న ప్రభాస్, డైరెక్టర్ ఓం రౌత్ లకు అభినందనలు అని చినజీయర్ స్వామి అన్నారు. అరణ్య కాండ, యుద్ధ కాండ ప్రధాన అంశాలుగా ఈ చిత్రాన్ని రూపొందించినట్లు చెప్పారు. ప్రతి ఒక్క మనిషిలో రాముడు ఉంటాడు. ప్రభాస్ తనలోని రాముడిని పైకి తెస్తున్నారు. ఈ చిత్రం తెరకెక్కించాలనే ఉత్సాహం కలిగినందుకు డైరెక్టర్ ఓం రౌత్, అతని టీంని అభినందిస్తున్నా. ఈ చిత్రాన్ని మీరంతా ఆదరిస్తే లోకం మొత్తం వ్యాపిస్తుంది అని చినజీయర్ స్వామి అన్నారు.