నెక్ట్స్ అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ లో రానా, ప్రభాస్ ?

chinese memes of baahubali meeting the avengers
Highlights

చైనాలో అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ సినిమా కూడా విడుదలైంది

బాహుబలి సినిమా ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పక్కరలేదు. భారతదేశం తరువాత సినిమా రంగానికి అతిపెద్ద మార్కెట్ గా ఉన్న చైనాలో ఇటీవలే ఈ సినిమా విడుదలైంది.  9000 స్క్రీన్స్ లో విడుదలైన ఈ సినిమా మొదటిరోజే 2.5 లక్షల డాలర్లు వసూలు చేసింది.  ఇదిలా ఉంటే, బాహుబలి విడుదలైన రోజునే చైనాలో అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ సినిమా కూడా విడుదలైంది.  ప్రపంచంలోనే తక్కువ సమయంలో అత్యధిక వసూళ్లు రాబట్టిన అవెంజర్స్ చైనా లో ప్రభంజనం సృష్టిస్తోంది.  చైనీస్  సోషల్ మీడియా యాప్ వుయ్ చాట్ లో బాహుబలి, అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ కు సంబంధించిన కొన్ని ఫోటోలు హల్చల్ చేస్తున్నాయి.  బాహుబలి.. అవెంజర్స్ ఒకే పోస్టర్ లో సృష్టిస్తే ఎలా ఉంటుందనే ఐడియాతో, ప్రభాస్, దేవసేన, రమ్యకృష్ణ, బ్లాక్ పాంథర్, ఫాల్కన్ తదితర క్యారెక్టర్లను ఒకచోట చేర్చి.. పోస్టర్లు సృష్టించారు. అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ లో రానా, ప్రభాస్ కలవాలని కోరుకుంటున్నామని చైనా ఫ్యాన్స్ తెలిపారు

loader