Asianet News TeluguAsianet News Telugu

ఆస్కార్ అవార్డు సినిమాకి సెన్సార్ దెబ్బ!

ఇటీవల ప్రకటించిన ఆస్కార్ అవార్డుల్లో పలు కేటగిరీల్లో 'బొహేమియన్ రాప్సోడీ' సినిమా అవార్డులు గెలుచుకుంది. అయితే ఇప్పుడు ఈ సినిమాను చైనాలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. 

China to remove LGBT scenes from Bohemian Rhapsody
Author
Hyderabad, First Published Mar 6, 2019, 4:57 PM IST

ఇటీవల ప్రకటించిన ఆస్కార్ అవార్డుల్లో పలు కేటగిరీల్లో 'బొహేమియన్ రాప్సోడీ' సినిమా అవార్డులు గెలుచుకుంది. అయితే ఇప్పుడు ఈ సినిమాను చైనాలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అక్కడ యదాథతంగా సినిమాను విడుదల చేయడం కుదరడం లేదు.

దానికి కారణం సినిమాలో చాలా వరకు ఎల్జీబీటీ(లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్జెండర్) సన్నివేశాలు ఉన్నాయి. వీటిని తొలగిస్తే గానీ తమ దేశంలో సినిమాను విడుదల కానివ్వమని చైనా సెన్సార్ బోర్డ్ తెలియజేయడంతో ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలను తొలగించాల్సివచ్చింది.

చిత్రబృందం ఊహించినదానికంటే సినిమాలో ఎక్కువ సన్నివేశాలకు కత్తెర వేసినట్లు తెలుస్తోంది. ఇంగ్లాండ్ కి చెందిన ఫ్రెడ్డీ మెర్క్యూరీ, క్వీన్ నిజ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు.

కథ ప్రకారం సినిమాలో హీరో మెర్క్యూరీ పాత్ర మరో మగ పాత్రను ముద్దు పెట్టుకునే సన్నివేశాలు, డ్రగ్స్ కి సంబంధించిన సన్నివేశాలు తొలగించిన తరువాత చైనాలో విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది.  

Follow Us:
Download App:
  • android
  • ios