సైరా 'నరసింహారెడ్డి' గెటప్ లో అదరగొడుతున్న ఈ బుడతడెవరు?

First Published 27, Jan 2018, 2:01 PM IST
child gets up as sye raa narsimha reddy who is that
Highlights
  • మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న సైరా నరసింహారెడ్డి
  • స్టైలిష్ డైరెక్టర్ సురెందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సైరా
  •  సైరా నరసింహారెడ్డి చిత్రంలో హీరో గెటప్ లో అదరగొడుతున్న బుల్లోడు

అభిమాన హీరోల మేనరిజమ్స్ ఫాలోకావటమంటే.. ఫ్యాన్స్ కు యమా సరదా. తమ అభిమాన హీరో కొత్తగా ఏది ట్రై చేసినా, దాన్ని ఫాలో అయిపోతుంటారు. ఇక తమ ముందు సూపర్ హీరోస్ వస్తే... చిన్నపిల్లలు ఆ కేరక్టర్స్ లో లీనమైపోయి యా హూ హా అంటూ ఫైట్స్ చేసేస్తుంటారు. ఇక టాలీవుడ్ లో మెగా స్టార్ కున్న కటౌట్ ఏంటో అర్థం కాదుగానీ.. ఆ కటౌట్ చూడగానే పిల్లలు, పెద్దలు, యూత్ ఎవరైనా సరే రఫ్పాడించేస్తారు. అదీ మెగా స్టార్ క్రేజ్. ఈ క్రేజీ హీరో తాజాగా సైరా నరసింహా రెడ్డిలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

 

ఇదే తరహాలో 'సైరా నరసింహా రెడ్డి'లో చిరంజీవి గెటప్ చూసి ముచ్చటపడ్డ ఓ చిన్నారి.. ఆ కాస్ట్యూమ్స్‌ లో భలే పోజులిచ్చాడు. మామూలుగా అయితే సినిమా రిలీజ్ కు రెడీ అయ్యాక కాస్ట్యూమ్స్ సందడి  చేస్తుంటాయి. కానీ షూటింగ్ టైమ్ లోనే ఓ కొత్త కేరక్టర్ ను ఓ చిన్న పిల్లాడు  ఆకళింపు చేసేసుకున్నాడు. చేతిలో కత్తితో.. 'సైరా నరసింహారెడ్డి' కాస్ట్యూమ్స్ లో మెరిసిపోతున్న ఓ బుడ్డోడి ఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. దీంతో ఎవరా ఈ చిట్టి తండ్రి? అని చాలామంది ఆరా తీస్తున్నారు. ఇంతకీ ఈ బుడ్డోడు ఎవరి కుమారుడో తెలుసా?.. సైరా దర్శకుడు సురేందర్ రెడ్డి కుమారుడు.

 

సైరా షూటింగ్ సెట్‌లో చిరంజీవిని ఆ గెటప్‌లో చూసి.. తనకూ అలాంటి కాస్ట్యూమ్స్ కావాలని తన తండ్రి సురేందర్ రెడ్డిని అడిగాడట ఈ బుడ్డోడు. ముద్దులొలికే మాటలతో కొడుకు తన కోరిక గురించి చెప్పేసరికి.. కాదనలేక సురేందర్ రెడ్డి కూడా 'సై' అన్నాడట. తండ్రి ఆ కాస్ట్యూమ్స్ తెప్పించడమే ఆలస్యం.. చేతిలో కత్తితో ఈ చిన్ని 'నరసింహారెడ్డి' హల్‌చల్ చేశాడు. ఫోటోలకు భలే పోజులిచ్చాడు. ఆ ఫోటోల్లో బుడ్డోడు ఇచ్చిన ఎక్స్‌ ప్రెషన్‌కు ఇప్పుడు ఫిదా అయిపోతున్నారు నెటిజెన్స్.

 

మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రంగా 'సైరా నరసింహారెడ్డి' తెరకెక్కుతోంది. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. నయనతార, అమితాబ్‌ బచ్చన్‌, జగపతిబాబు, సుదీప్‌, విజయ్‌ సేతుపతి తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సైరా తొలి షెడ్యూల్ ఇటీవలే పూర్తయింది. ఫిబ్రవరి నుంచి రెండో షెడ్యూల్‌ ప్రారంభం కానుంది.

loader