సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న 'మహర్షి' సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ వేడుకకు గెస్ట్ గా ఎవరు రానున్నారనే విషయంలో ఆసక్తి నెలకొంది. కేవలం ప్రచారం కోసమే కాకుండా.. ఈసారి సెంటిమెంట్ కూడా ఫాలో అవుతున్నారని సమాచారం.

మహేష్ నటించిన 'భరత్ అనే నేను' సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కి ఎన్టీఆర్ ని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. మహేష్-ఎన్టీఆర్ ఒకే వేదికపై కనిపించడంతో సినిమాకు కావలసినంత పబ్లిసిటీ వచ్చింది. ఎన్టీఆర్ రాకతో సినిమాకు మరిన్ని టికెట్లు తెగాయనే వారు కూడా ఉన్నారు.

ఇప్పుడు 'మహర్షి'కి కూడా అదే సెంటిమెంట్ ఫాలో అవుతారనే మాటలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి ఎన్టీఆర్ 'RRR' షూటింగ్ నుండి చిన్న బ్రేక్ తీసుకున్నాడు. కాబట్టి ఈవెంట్ కి హాజరయ్యే ఛాన్స్ ఉంటుంది. నిజానికి 'భరత్ అనే నేను' సినిమా ఈవెంట్ కి ఎన్టీఆర్ తో పాటు చరణ్ కూడా రావాల్సింది కానీ కొన్ని కారణాల వలన కుదరలేదు.

దీంతో ఈసారి చరణ్ కి కూడా ఆహ్వానిస్తారని అంటున్నారు. నిజ జీవితంలో ఈ ముగ్గురూ మంచి స్నేహితులనే సంగతి తెలిసిందే. ఈ ముగ్గురు ఒకే స్టేజ్ పై కనిపిస్తే ఆ హడావిడే వేరుగా ఉంటుంది. ఇక ఈవెంట్ విషయానికొస్తే.. మే 1న హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో వేడుక జరగనుంది.