బాలయ్య నిర్మాత పరిస్థితి చూశారా?

chengala venkatrao present situation
Highlights

ఒకప్పుడు బాలకృష్ణతో 'సమరసింహారెడ్డి' వంటి బ్లాక్ బస్టర్ సినిమాను రూపొందించిన నిర్మాత చెంగల

ఒకప్పుడు బాలకృష్ణతో 'సమరసింహారెడ్డి' వంటి బ్లాక్ బస్టర్ సినిమాను రూపొందించిన నిర్మాత చెంగల వెంకట్రావు ఆ తరువాత జూనియర్ ఎన్టీఆర్ తో కూడా సినిమా చేశారు. సినిమాల తరువాత ఎమ్మెల్యేగా కూడా వ్యవహరించారు. అప్పట్లో ఆయన ఓ రేంజ్ లో బ్రతికాడు. అటువంటిది సడెన్ గా కేజీహెచ్ ఆసుపత్రిలో అందరి రోగుల మాదిరి కనిపించడంతో అందరూ షాక్ అయ్యారు.

అసలు విషయంలోకి వస్తే 2004 లో పాయకరావుపేట ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన ఆ తరువాత ఎన్నికల్లో మాత్రం ఓడిపోయారు. అయితే 2007లో నక్కపల్లి మండలం బంగారమ్మపేట బీచ్ మినరల్స్ కంపనీకు వ్యతిరేకంగా జరిగిన గొడవలో ఓ మత్స్యకారుడు మరణించాడు. ఈ కేసులో చెంగల వెంకట్రావుని నిందితుడిగా గుర్తించారు. దీనిపై పదేళ్ల పాటు విచారణ జరిగిన తరువాత చెంగలని దోషిగా నిర్ధారించారు.

దీంతో ఆయనకు యావజ్జీవ కారాగారశిక్ష విధించారు. అయన మలేరియా బారిన పడడంతో కేజీహెచ్ లో జాయిన్ చేశారు. ఆయనతో పాటు చాలా మంది మలేరియా బాధితులను జాయిన్ చేశారు. వారిని పరామర్శించడానికి వెళ్లిన జిల్లా కలెక్టర్ చెంగల వెంకట్రావు ఓ నిర్మాత, ఒకప్పుడు ఎమ్మెల్యే అని తెలుసుకొని ఆశ్చర్యపోయాడట. గుర్తుపట్టలేని విధంగా మారిపోయిన ఆయన దీనంగా చేతులు కట్టుకొని నిలబడడం చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. అతడు చేసిన తప్పు ఈరోజు అతడిని ఈస్థాయికి దిగజార్చిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. 
 

loader