Asianet News TeluguAsianet News Telugu

'మంజుమ్మల్ బాయ్స్' నిర్మాతపై ఛీటింగ్ కేసు, బ్యాంక్ అకౌంట్‌ ఫ్రీజ్‌.. ఏం జరిగిందంటే?

మ‌ల‌యాళంలో  బ్లాక్‌బ‌స్ట‌ర్   అయిన చిత్రం మంజుమ్మ‌ల్ బాయ్స్ . రూ.20కోట్ల ప‌రిమిత బ‌డ్జెట్‌తో నిర్మిత‌మైన ఈ స‌ర్వైవ‌ల్ థ్రిల్ల‌ర్ ఏకంగా రూ.250కోట్ల పైచిలుకు వ‌సూళ్లు రాబ‌ట్టి కొత్త రికార్డులు నెల‌కొల్పింది. 

Cheating Case filed on Manjummel Boys Producers, Bank accounts Frozen jsp
Author
First Published Apr 14, 2024, 1:42 PM IST

కలెక్షన్లలో సెన్సేషన్  రికార్డులు సృష్టించిన ‘మంజుమ్మల్ బాయ్స్’ సినిమా ఇప్పుడు అనేక వివాదాల్లో ఇరుక్కుంటోంది. ఈ చిత్రం నిర్మాతల బ్యాంకు ఖాతాలను స్తంభింప చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేయటం అంతటా హాట్ టాపిక్ గా మారింది.  ఈ మధ్య కాలంలో మ‌ల‌యాళంలో  బ్లాక్‌బ‌స్ట‌ర్   అయిన చిత్రం మంజుమ్మ‌ల్ బాయ్స్ . రూ.20కోట్ల ప‌రిమిత బ‌డ్జెట్‌తో నిర్మిత‌మైన ఈ స‌ర్వైవ‌ల్ థ్రిల్ల‌ర్ ఏకంగా రూ.250కోట్ల పైచిలుకు వ‌సూళ్లు రాబ‌ట్టి కొత్త రికార్డులు నెల‌కొల్పింది. అయితే ఓ ప్రక్కన  పీవీపి మల్టిఫ్లెక్స్ సమస్య తో వార్తల్లోకి వచ్చిన ఈ చిత్రం ఇప్పుడు కోర్టు కేసుతో మరోసారి అందరి నోళ్లలో నానుతోంది.

 కేరళ అరూర్‌కు చెందిన సిరాజ్‌ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై ఎర్నాకులం సబ్‌ కోర్టు ఈ తీర్పునిచ్చింది. తాను సినిమా కోసం 7 కోట్ల రూపాయలు ఖర్చు చేసినా డివిడెండ్, పెట్టుబడి కూడా ఇవ్వలేదని సిరాజ్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. సబ్ కోర్టు జడ్జి సునీల్ వర్కి ఈ స్పీమా నిర్మాణ సంస్థ పరవ ఫిల్మ్స్ మరియు దాని భాగస్వామి షాన్ ఆంటోనీ 40 కోట్ల విలువైన బ్యాంక్ ఖాతాను స్తంభింపజేశారు. సిరాజ్ వలియతార హమీద్ దాఖలు చేసిన పిటిషన్‌లో.. సినిమా నిర్మాణానికి 7 కోట్లు ఖర్చు చేశారన్నారు. నిర్మాతలు 40 శాతం లాభాల వాటా వాగ్దానం చేసి డబ్బులు తీసుకున్నారని, ఆపై లాభం లేదా పెట్టుబడి చెల్లించకుండా మోసం చేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు.
 
పిటిషన్ ప్రకారం, ఇది ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ. 220 కోట్లు మరియు OTT ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా దాదాపు రూ. 20 కోట్లు వసూలు చేసింది. సినిమా నిర్మాతలు సౌబిన్ షాహిర్, బాబు షాహిర్‌లకు కోర్టు నోటీసులు పంపింది. చిదంబరం దర్శకత్వం వహించిన ఈ మల్టీ స్టారర్ సినిమాకి మలయాళ పరిశ్రమ నుంచే కాక ఇతర భాషల నుంచి కూడా మంచి స్పందన వచ్చింది. బాబు షాహిర్, సౌబిన్ షాహిర్ – షాన్ ఆంటోని నిర్మించిన ఈ చిత్రాన్ని పరవ ఫిలిమ్స్ మరియు శ్రీ గోకులం మూవీస్ రిలీజ్ చేశాయి. సౌబిన్ షాహీర్, శ్రీనాథ్ భాసి, బాలు వర్గీస్, గణపతి, లాల్ జూనియర్, చంతు సలీంకుమార్, అభిరామ్ రాధాకృష్ణన్, దీపక్ పరంబోల్, ఖలీద్ రెహమాన్, అరుణ్ కురియన్, విష్ణు రఘు తదితరులు నటించారు.

 దీంతో ఇప్పుడా సినిమాని అదే పేరుతో తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చింది ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్‌. ఈ సినిమా అక్కడ స్దాయిలో వర్కవుట్ కాలేదు కానీ తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగానే నచ్చిందని చెప్పాలి. భారీ వ‌సూళ్లు కొల్ల‌గొట్టకపోయినా మంచి కలెక్షన్స్ తోనే థియేటర్స్ నిండుతున్నాయి. ఇప్పుడు ఈ సినిమా ఓటిటి రిలీజ్ కు రెడీ అయ్యింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios