నటిని మోసం చేసిన యువ దర్శకుడు!

cheating case filed againt young director sri dutta
Highlights

టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ ఉందని, దీని కారణంగా జీవితాలు నాశమవుతున్నాయని కొందరు నటీమణులు బహిరంగంగా కామెంట్స్ చేస్తోన్న సంగతి తెలిసిందే

టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ ఉందని, దీని కారణంగా జీవితాలు నాశమవుతున్నాయని కొందరు నటీమణులు బహిరంగంగా కామెంట్స్ చేస్తోన్న సంగతి తెలిసిందే. నటి శ్రీరెడ్డి ఈ వివాదంపై తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ లు పెడుతూనే ఉన్నారు. అవకాశం ఇస్తామని చెప్పి మోసం చేసే దర్శకులు, నిర్మాతలకు ఇక్కడ కొదవే లేదని ఆమె సంచలన కామెంట్స్ చేసింది.

తాజాగా ఓ జూనియర్ ఆర్టిస్ట్ కు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పిన ఓ యువ దర్శకుడు ఆమెపై మోజు తీరిన తరువాత ముఖం చాటేశాడని పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. వివరాల్లోకి వెళితే.. పి.లక్ష్మి అనే జూనియర్ ఆర్టిస్ట్ ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెను మోసం చేశాడట శ్రీ దత్త అనే యువ దర్శకుడు. కొంతకాలం పాటు ఆమెతో సహజీవనం చేసి కోరికలు తీర్చుకున్న శ్రీదత్త ఆమెను వదిలేయడంతో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.

ప్రస్తుతం సదరు దర్శకుడు పరారీలో ఉన్నాడని సమాచారం. అతడిని అదుపులోకి తీసుకున్న తరువాత విచారణ చేపడతామని పోలీసులు వెల్లడించారు.  

loader