బాలీవుడ్ స్టార్ హీరో హ్రితిక్ రోషన్ పై చీటింగ్ కేసు నమోదు చేశారు చెన్నై పోలీసులు. 2014లో హెచ్ ఆర్ ఎక్స్ పేరుతో హ్రితిక్ రోషన్ ఓ బ్రాండ్ ను ప్రారంభించారు. ఈ బ్రాండ్ కి స్టాకిస్ట్ గా తనను నియమించి డబ్బు ఇవ్వకుండా మోసం చేశారని మురళీధరన్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ బ్రాండ్ కి సంబంధించిన ఉత్పత్తులను తనకు పంపించకుండా రూ.21 లక్షలకు మోసం చేశారని, తనకు కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా సంస్థను మూసివేశారని ఆరోపించారు. అతడు ఇచ్చిన కంప్లైంట్ కారణంగా హృతిక్ రోషన్, మరో ఎనిమిది మందిపై కొడుంగయూర్ పోలీసులు కేసు నమోదు చేశారు.

ప్రస్తుతం హృతిక్ రోషన్ గణిత మేధావి ఆనంద్ కుమార్ జీవిత కథతో తెరకెక్కుతోన్న 'సూపర్ 30' సినిమాలో నటిస్తున్నారు. వికాస్ బల్ ఈ సినిమాకు దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. 'క్వీన్' సినిమాను తెరకెక్కించింది ఈ దర్శకుడే కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే సినిమాలో హృతిక్ రోషన్ లుక్ బయటకి లీకైంది. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరిలో విడుదల చేయనున్నారు.