‘నాలో కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయి. కానీ టెస్ట్ లు చేయించుకునే పరిస్దితి కనపడటం లేదు. గొంతు నొప్పి తలనొప్పి ఒళ్లు నొప్పులతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తింది అంటోంది టీవి సీరియల్ నటి  కసౌటీ జిందగీ కే ఫేం చార్వీ సరాఫ్ ఆవేదన వ్యక్తం చేశారు. వైరస్ లక్షణాలు కనిపించడంతో ఐదు రోజులుగా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయించుకునేందుకు అన్ని రకాలుగా ప్రయత్నించి విఫలమయ్యాయని  ఆమె వాపోయారు. సెలబ్రెటీని అయిన నాకే ఈ పరిస్దితి ఉంటే ఇంక సామాన్యుల సంగతేంటని ఆమె ప్రశ్నించారు. ఈ మేరకు చార్వీ సరాఫ్ బహిరంగ లేఖ రాశారు.

ఆ లేఖలో ఏముందంటే...‘నాలో కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయి. కానీ ఢిల్లీలో టెస్టు చేయించుకోవడం ఎంత ప్రహసనంతో కూడుకున్న పనో తెలుసా? లాక్డౌన్ విధించినప్పటి నుంచి నా స్వస్థలం ఢిల్లీలోనే ఉన్నా. అందరిలాగే మా కుటుంబమంతా ఇంటికే పరిమితమైంది. నిత్యావసరాలకు తప్ప బయటకు వెళ్లడం లేదు. కరోనాతో కలిసి జీవించడానికి అలవాటు పడ్డాం. అయితే గతవారం రోజులుగా నాకు ఆరోగ్యం బాగుండటం లేదు. జ్వరం వచ్చింది.

 గొంతు నొప్పి తలనొప్పి ఒళ్లు నొప్పులతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తింది. ఆనాటి నుంచి మా ఫ్యామిలీ డాక్టర్లు ప్రైవేటు డాక్టర్లు ప్రభుత్వ ఆస్పత్రులకు ఫోన్ చేస్తూనే ఉన్నా. అందరిదీ ఒకేమాట.. తగినన్ని కిట్లు అందుబాటులో లేవట. ఆ మాటలు వినీ వినీ నాకు విసుగు వచ్చింది. రోజూ మీడియాలో వార్తలు ఏమో అనుకున్నా గానీ.. అవన్నీ నిజమే. ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో తెలియడం లేదు. నేను స్వీయ నిర్బంధంలోకి వెళ్తున్నా. నా పరిస్థితి ఇలా ఉందంటే.. ఏ ఆధారం లేని వాళ్లు ఈ కష్టకాలాన్ని మహమ్మారిని ఎలా ఎదుర్కొంటారో’’అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.