దర్శకుడు పూరి జగన్నాథ్ తన ప్రొడక్షన్ పార్టనర్ ఛార్మితో కలిసి ఇటీవల ఓ సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ హీరోగా పూరి తన బ్యానర్ పై సినిమా తీయబోతున్నాడు. నిజానికి పూరి తీసిన 'ఇస్మార్ట్ శంకర్' విజయ్ కోసం రాసుకున్న కథ అని చెబుతారు.

కానీ అతడితో చేయడం కుదరలేదు. ఇప్పుడు వీరి కాంబోలో సినిమా అంటే ఆడియన్స్ లో అంచనాలు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం సినిమాకి సంబంధించిన కాస్టింగ్ ప్రాసెస్ జరుగుతోంది. విజయ్ సరసన హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ని తీసుకోవాలని పెద్ద ప్లాన్ చేస్తున్నారు.

ఈ మేరకు ఛార్మి.. జాన్వీతో చర్చలు జరుపుతోందని సమాచారం. ఆమె గనుక అంగీకరిస్తే సినిమాకు హైప్ వస్తుందని భావిస్తున్నారు. ఇటీవల ఓ టీవీ షోలో జాన్వీ టాలీవుడ్ లో తన ఫేవరేట్ హీరో విజయ్ దేవరకొండ అని అతడితో కలిసి నటించాలనుందని చెప్పింది. ఇప్పుడు పూరి చెప్పే కథ గనుక ఆమెకి నచ్చితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. 

అప్పుడు విజయ్ దేవరకొండ సినిమాతో జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడం ఖాయమవుతుంది. మరి తన తల్లి మాదిరి తెలుగులో కూడా జాన్వీ సత్తా చాతుతుందేమో చూడాలి. ప్రస్తుతం ఈ బ్యూటీ ఓ బయోపిక్ అలానే 'తక్త్' అనే చిత్రాల్లో నటిస్తోంది!